అండమాన్‌లోకి నైరుతి ప్రవేశం
వాటి ప్రభావంతో అక్కడ భారీ వర్షాలు
జూన్ తొలి వారంలో తెలంగాణకు
భారత వాతావరణ విభాగం వెల్లడి
ఈ ఏడాది విస్తారంగానే వర్షాలు!
South West Monsoon | అధిక వర్షాలు కురిపించి దేశాన్ని సుభిక్షం చేసే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందే వచ్చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అవి మరింత చురుగ్గా కదులుతు ముందుకు సాగుతున్నాయి. రుతుపవనాల రాకతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంతటికీ విస్తరించి దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
మే 27 నాటికే కేరళకు
మే 27నాటికి కేరళను తాకనున్నట్లుగా ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలోకి జూన్ 5వ తేదీలోగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ భావిస్తున్నది. సాధారణంగా జూన్ 1నాటికి దేశంలోకి ఎంట్రీ ఇచ్చే రుతుపవనాలు ఈ ఏడాది ముందుగా మే 27నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. 2009లో మే 23 నాటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించగా.. మళ్లీ సాధారణం కంటే ముందుగా రావడం ఈ ఏడాది మాత్రమే కానుంది. గత ఏడాది మే 30న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ఏడాది మూడు రోజుల ముందుగా కేరళాను తాకనున్నాయి.
ఈసారి అధిక వర్షపాతం
ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవ్వనుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. సాధారణంగా దేశంలో సగటు వర్షాపాతం 880మిల్లిమీటర్ల ఉండగా.. ఈ ఏడాది 105 శాతం ఎక్కువగా ఉండనుందని అంచనా వేసింది. కాగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2నుంచి 3డిగ్రీలు తగ్గనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
Mars Curiosity Rover | అంగారకుడి మీద జీవంపై కొత్త క్లూ! వింత నిర్మాణాల గుర్తింపు!
Mutton Piece: వ్యక్తి ప్రాణం తీసిన మటన్ ముక్క!
Cool Drinks Van: రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా..జనం పరుగులు!
Sravanthi Chokarapu | థాయ్‌లాండ్‌లో ఫుల్‌గా చిల్ అవుతున్న యాంకర్ స్రవంతి
ఖరీదైన ఇల్లు కొన్న ‘అనసూయ’.. గృహ ప్రవేశం ఫోటోలు వైరల్