Site icon vidhaatha

Viral Video | ఎద్దునే ఎదురించి.. ప్రాణాలు కాపాడుకున్న మ‌హిళ‌..

Viral Video | ఎద్దు( Stray Bull )నే ఎదురించింది ఓ మ‌హిళ( Woman ). ఓ నిమిషం పాటు ఎద్దుతో వీరోచిత పోరాటం చేసి త‌న ప్రాణాల‌ను కాపాడుకుంది. స్వ‌ల్ప గాయాల‌తో ఆమె ఎద్దు నుంచి త‌ప్పించుకుంది. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ( Delhi )లో అక్టోబ‌ర్ 30న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

ఢిల్లీ( Delhi )కి చెందిన ఓ మ‌హిళ త‌న ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌ల్లీలో న‌డుచుకుంటూ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అటుగా వ‌చ్చిన ఓ ఎద్దు( Stray Bull ) ఆక‌స్మికంగా ఆమెపై దాడికి పాల్ప‌డింది. ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గురైన ఆ మ‌హిళ‌.. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌లేదు. ఎద్దుతో వీరోచితంగా పోరాటం చేసింది. ఒక చేతితో కొమ్మును, మ‌రో చేతితో దాని నోటిని అదిమిప‌ట్టింది. దీంతో ఎద్దు ఆమెపై దాడి చేసేందుకు సాధ్యం కాలేదు.

అయితే ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. దాదాపు ఒక నిమిషం పాటు అలానే ఎద్దుతో పోరాడింది. చివ‌ర‌కు ఓ వ్య‌క్తి ఎద్దు కొమ్మును ప‌ట్టుకుని బ‌లంగా నెట్టేశాడు. ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. మ‌రో యువ‌తిపై కూడా ఎద్దు దాడి చేసేందుకు య‌త్నించ‌గా, క‌ర్ర‌తో కొట్ట‌గా అది ప‌రుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు సోష‌ల్ మీడియా( Social Media )లో వైర‌ల్ అవుతున్నాయి.

Exit mobile version