Site icon vidhaatha

ఉప్పొంగిన తమిళనాడు కుర్తాళం జలపాతం.. బాలుడి గల్లంతు

విధాత : తమిళనాడు రాష్ట్రంలోని కుర్తాళం జలపాతం ఆకస్మికంగా పెరిగిన వరదతో ఉప్పోంగడంతో నీటి ప్రవాహంలో ఓ బాలుడు గల్లంతయ్యాడు. జలపాతం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు జలపాతం నుంచి ఒక్కసారిగా భారీ వరద కిందకు దూసుకొచ్చింది. అప్పటిదాక జలపాతం వద్ధ కేరింతలతో స్నానాలు చేస్తున్న పర్యాటకులు ఆకస్మిక వరద నీటితో భీతిల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.

వరద ఉదృతిలో 16 ఏళ్ల అశ్విన్ అనే బాలుడు కొట్టుకపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు. వరద సమీపంలోని దుకాణాలను, నివాసాలను కూడా ముంచెత్తింది. కుర్తాళం జలపాతం అకస్మాత్తుగా ఉప్పొంగి వరద నీరు దూసుకొచ్చిన దృశ్యాలు..పర్యాటకుల పరుగుల వీడియో వైరల్‌గా మారింది.

Exit mobile version