NEET-UG results । నీట్‌ అవకతవకలపై సీబీఐ విచారణ పిటిషన్‌కు డేట్‌ ఫిక్స్‌ చేసిన సుప్రీంకోర్టు

నీట్‌-యూజీ 2024 పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది

  • Publish Date - June 14, 2024 / 04:21 PM IST

న్యూఢిల్లీ : నీట్‌-యూజీ 2024 పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నీట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ 2024 పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీకేలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ సైందీప్‌ మెహతా ధర్మాసనం విచారించింది. రెండు వారాల్లో తమ స్పందనలను దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఎన్టీయేను ఆదేశించింది.

జూలై 9న ఈ పిటిషన్‌పై విచారణ జరుపున్నట్టు ప్రకటించింది. వివిధ హైకోర్టుల్లో నీట్‌-యూజీ పరీక్షపై దాఖలైన అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలన్న ఎన్టీయే పిటిషన్‌ను కూడా దర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ మేరకు ప్రైవేట్‌ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. అయితే.. మే 5వ తేదీన నిర్వహించిన పరీక్షలో సమయం కోల్పోయినందుకు గాను 1563 మంది పరీక్షార్థులకు గ్రేస్‌మార్కులు ఇవ్వాలన్న అంశంలో దాఖలు చేసినవి కావడంతో సదరు మూడు పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఎన్టీయే కోర్టుకు తెలిపింది. ఈ అంశం పరిష్కారమైందని పేర్కొన్నది.

Latest News