విధాత: భూమి మీద నూకలుంటే ఎన్ని గండాలైన ధాటి బతుకవచ్చంటారు పెద్దలు. ఆ మాటలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డు మార్గంలో ఓ వ్యక్తి తన జీపులో వెళ్తుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు..ఆ బండరాళ్లు ఆ వాహనంపై కాకుండా దాని పక్కనే బండరాళ్లు పడటంతో రెప్ప పాటులో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ సమీపంలో ఉన్న తాత్యూర్‌లో చోటు చేసుకుంది.
తాజాగా క్లౌడ్ బరస్ట్ తో పాటు వరుస వర్షాలు, వరదలు ఆ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలతో కొండ ఛరియలు విరిగిపడగా.. కొండ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నదులు, వాగులు బురద నీరు, రాళ్లు, అటవీ ప్రాంతాల్లోని దుంగలతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోగా..ఇళ్లు బురద నీటి మయమయ్యాయి.