Two Girls Love Marriage | ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్ద‌ర‌మ్మాయిలు.. గ్యాస్ స్ట‌వ్ చుట్టూ ఏడ‌డుగులు..!

Two Girls Love Marriage | ఇన్‌స్టాలో క‌లుసుకున్నారు.. ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. అదేదో అమ్మాయి.. అబ్బాయి అనుకుంటే పొర‌పాటే. ఇన్‌స్టా వేదిక‌గా పురుడుపోసుకున్న ప్రేమ ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య‌. వీరిద్ద‌రూ గాఢంగా ప్రేమించుకుని పెళ్లాడారు.

Two Girls Love Marriage | ఇన్‌స్టాలో క‌లుసుకున్నారు.. ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. అదేదో అమ్మాయి.. అబ్బాయి అనుకుంటే పొర‌పాటే. ఇన్‌స్టా వేదిక‌గా పురుడుపోసుకున్న ప్రేమ ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య‌. వీరిద్ద‌రూ గాఢంగా ప్రేమించుకుని పెళ్లాడారు. ఈ పెళ్లి తంతు బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

బీహార్‌లోని మ‌ధేపురా జిల్లాలోని ఓ రెండు గ్రామాల‌కు చెందిన ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య ఇన్‌స్టా వేదిక‌గా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. సుపాల్ ప‌ట్ట‌ణంలోని త్రివేణి గంజ్ ప‌రిష‌త్ ప్రాంతంలోని ఓ మాల్‌లో ప‌ని చేస్తున్నారు. ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్నారు. ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ బంధాన్ని జీవితాంతం కొన‌సాగించాల‌ని ఇద్ద‌ర‌మ్మాయిలు నిర్ణ‌యించుకున్నారు.

గ్యాస్ స్ట‌వ్ చుట్టూ ఏడు అడుగులు

ఇక బీహార్‌లోని కాళీమాత మందిరానికి వెళ్లి.. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఇద్ద‌రమ్మాయిలు వివాహం చేసుకున్నారు. ఈ వివాహం మంగ‌ళ‌వారం రాత్రి జ‌రగ్గా, వీరి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే పెళ్లి సంద‌ర్భంగా స్థానికంగా హోమం ఏర్పాటు చేస్తారు. కానీ హోమం చేసే స్తోమ‌త లేక‌.. గ్యాస్ స్ట‌వ్ చుట్టూ ఏడు అడుగులు వేసి.. మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.

రెండు నెల‌ల నుంచి స‌హ‌జీవ‌నం

ఈ ఇద్ద‌రు అమ్మాయిలు గ‌త రెండు నెల‌ల నుంచి ఓ రూమ్‌ను కిరాయికి తీసుకుని స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి పెళ్లి కాగానే, బుధ‌వారం ఉద‌యం ఇద్ద‌రు కూడా త‌మ గ‌దికి చేరుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అమ్మాయిల నివాసం దగ్గర పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. విషయంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి చాలా మంది ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు.

అబ్బాయిలంటే ఆసక్తి లేదు

వారి వివాహం, సహవాసంపై అమ్మాయిలు వివరణ ఇచ్చారు. వారికి ముందు నుంచే అబ్బాయిలంటే ఆసక్తి లేదన్నారు. వారిద్దరు పరస్పరం పూర్తిగా అర్థం చేసుకున్నారని, తమది బంధం భావోద్వేగమైందని తెలిపారు. ఈ పెళ్లిపై తమకు తాము ఎవరూ ఒత్తిడి చేసుకోలేదని వివరించారు. స్వలింగ వివాహం చేసుకున్న యువతులిద్దరూ తమ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్​గా మారింది.

Latest News