లానినా అంటే ఏంటి? దీంతో లాభ, నష్టాలు ఎంత? సముద్రాలతో వర్షాలకు ఉన్న సంబంధాలు ఏంటి? లా నినోతో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయా? లానినా ప్రభావం ఇండియాపై ఏ మేరకు ఉంటుంది? దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? తెలుసుకుందాం.
లానినా అంటే ఏంటి?
పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పును లానినా అంటారు. ఇది ప్రపంచ వాతావరణంలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది. లానినా అనేది ప్రతి మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఒకసారి వస్తుంది. కొన్ని సమయాల్లో వరుస సంవత్సరాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ లో ఒక భాగం. లా నినాతో తూర్పు పసిఫిక్‌లోని నీటిని సాధారణం కంటే మరింత చల్లగా మారుతుంది. లా నినాతో వర్షాలపై ప్రభావం చూపే అవకావశం ఉంది. అంటే రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కరువు పరిస్థితులకు లానినా కారణమయ్యే అవకాశం ఉందని చెబుతారు. లానినా అంటే స్పానిష్ భాషలో చిన్న అమ్మాయి అని అర్ధం.
లానినా ఎలా ఏర్పడుతుంది?
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా మారడం వల్ల లానినా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ భూమధ్యరేఖ, పసిఫిక్ మీదుగా తూర్పు నుండి పడమరకు వీచే సాధారణ పవనాల తీవ్రతతో ప్రారంభమవుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో నీరు చల్లదనానికి కారణం పసిఫిక్ పవనాల బలం పెరగడమే. దీని ఫలితంగా చల్లని నీరు లోతుల నుండి పైకి వస్తుంది, ఈ ప్రక్రియను అప్వెల్లింగ్ అంటారు. ఈ పరిణామక్రమాన్ని “లా నినా” అని పిలుస్తారు. దక్షిణ అమెరికా నుండి ఇండోనేషియా వరకు బలమైన గాలులు వెచ్చని నీటిని పశ్చిమానికి నెడతాయి, దానివల్ల చల్లని నీరు ఉపరితలంపైకి వస్తుంది. ఇది ప్రపంచ వాతావరణంలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది. ఎల్ నినో సమయంలో భూమధ్యరేఖ, పసిఫిక్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలుంటాయి.
లానినా ప్రభావం ఎలా ఉంటుంది?
లానినా చక్రం ఎల్ నినో దశలో అంతరాయం కలిగిస్తుంది. ఈ దశలో వేడి ఉపరితల గాలులు పశ్చిమం నుండి తూర్పునకు వీస్తాయి. చల్లని గాలులు తూర్పు నుండి పడమరకు కదులుతాయి. దీని వలన భారతదేశం,ఆఫ్రికాలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.లానినా గాలులు వెచ్చని ఉపరితల నీటిని పశ్చిమ పసిఫిక్ వైపునకు నెడుతాయి. దీంతో దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వద్ద లోతైన చల్లని నీరు ఉపరితలంపైకి వస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. లానినాతో కొన్ని ప్రాంతాల్లో పొడి,చల్లని వాతావరణానికి దారి తీయవచ్చు.అట్టాంటిక్ హరికేన్ సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ తుఫాన్లు ఏర్పడడానికి దారితీయవచ్చు. భారతదేశంలో తక్కువ వర్షపాతం, తుఫాన్లు తక్కువగా ఏర్పడడానికి కారణం కావచ్చు. 2020-23లో లానినా చివరిసారిగా ఏర్పడింది. గత ఏడాది జూలైలో లా నినా వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తలు లా నినా వచ్చే అవకాశాలు 57-60 శాతం ఉన్నాయని చెబుతున్నారు. దీనివల్ల రుతుపవనాలు బలహీనపడవచ్చు. భారత్ లో వర్షపాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వేసవిలో వేడి పెరుగుతుంది. బంగాళాఖాతంలో ఉష్ణమండల తుఫాన్లు తగ్గే అవకాశం ఉంది. భారత్ లో చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉంది. ఉత్తర భారత్ లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండవచ్చు.
చిన్న మార్పుతో ప్రపంచ వాతావరణంలో పెను మార్పులు
లానినా ఏర్పడిన సమయంలో శీతాకాలంలో వచ్చే గాలులు సాధారణం కంటే చాలా బలంగా ఉంటాయి. దీని వల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో నీరు సాధారణంగా ఉండే దానికంటే కొన్ని డిగ్రీలు చల్లగా ఉంటుంది. సముద్ర ఉష్ణోగ్రతలో ఈ చిన్న మార్పు కూడా ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.సాధారణంగా వెచ్చని సముద్రపు నీటిపై వర్షపు మేఘాలు ఏర్పడతాయి. లా నినా ఈ వెచ్చని నీటిని పశ్చిమ పసిఫిక్‌కు తరలిస్తుంది. దీని అర్థం ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణం కంటే చాలా ఎక్కువ వర్షపాతం పొందవచ్చు. అయితే తూర్పు పసిఫిక్‌లోని చల్లని నీరు అక్కడ తక్కువ వర్షపు మేఘాలు ఏర్పడటానికి కారణమవుతుంది. దీంతో యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రదేశాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉంటాయి.లా నినా అనేది పసిఫిక్ మహాసముద్రంపై ఉన్న వాతావరణం మధ్య పరస్పర చర్య వల్ల సంభవిస్తుంది. , లా నినా సమయంలో పర్యావరణ పరిస్థితులు ఉష్ణమండలాలలో మరిన్ని తుఫానులకు దారితీయవచ్చు. వీటిలో హరికేన్‌లు కూడా ఉంటాయి. ఎల్ నినో, లానినా ఏర్పడే అవకాశాలను ఏడాది ముందుగానే శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి ఆధారంగా వాతావరణ శాస్త్రవేత్తలు వార్నింగ్స్ జారీ చేస్తున్నారు.
