న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికైన సంగతి తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ పదవి చేపట్టడం వరుగా ఇది రెండోసారి కావడం విశేషం. ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. ఎంఎ అయ్యంగార్, జీఎస్ ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా రెండు సార్లు స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. రెండో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఎంఎ అయ్యంగార్.. చిత్తూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైన ఆయన.. రెండు టర్మ్‌లకు కలిపి 6 ఏండ్ల 22 రోజుల పాటు స్పీకర్‌గా కొనసాగారు.
జీఎస్ ధిల్లాన్.. తర్న్ తరన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన 6 ఏండ్ల 110 రోజుల పాటు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బలరాం ఝాఖడ్ ఫిరోజ్‌పూర్, శికర్ నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 8వ లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బలరాం అత్యధికంగా 9 ఏండ్ల 329 రోజుల స్పీకర్ పదవిలో కొనసాగారు. జీఎంసీ బాలయోగి అమలాపూరం నుంచి గెలుపొందారు. 12వ లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. బాలయోగి 3 ఏండ్ల 342 రెండు స్పీకర్‌గా పని చేశారు.
61 ఏండ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 2014-19 మధ్యకాలంలో 86 శాతం హాజరును నమోదు చేసుకుని, 671 ప్రశ్నలడిగారు. ఆ సమయంలో సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఇక 2023లో ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మళ్లీ ఇప్పుడు కూడా ఆయనే ఎన్నిక కావడం విశేషం.