విధాత : ఎండల ధాటికి మనుషులతో పాటు పశు పక్ష్యాదులు, వన్యప్రాణులు సైతం విలవిలలాడిపోతున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నీడపట్టున, కొండలు, నదులు, సెలయేళ్లలో సంచరిస్తూ జీవించే వన్యప్రాణులు జూపార్కులలో పరిమిత భూభాగంలో జీవించడంలో ఇబ్బందిపడటం సహజమే. అందులోనూ ఎండకాలంలో ఎండల వేడి తీవ్రతకు తాళలేక తల్లడిల్లుపోతు నీరసించిపోతుంటాయి. అందుకే దేశంలోని జూపార్కులలో వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు జూ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
తీవ్రమైన ఎండ నుండి జంతువులను రక్షించేందుకు జైపూర్‌లోని నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో అటవీ శాఖ ప్రత్యేక చర్యలను అమలు చేస్తుంది. వన్యప్రాణుల కోసం పార్కు అంతటా భారీ కూలర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. అలాగే వాటి ఆహార విధానంలోనూ మార్పులు చేశారు. వాటికి చల్లదనం కోసం ప్రత్యేక షెడ్ లు, నీటి వసతులు కల్పించారు. ఇదే పద్ధతిలో హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లోని జూపార్కులలో వన్యప్రాణుల సంరక్షణకు జూ సిబ్బంది చల్లదనంలో కూడిన చర్యలు అమలు చేస్తుండటం గమనార్హం.
VIDEO | Jaipur, Rajasthan: The Forest Department has implemented special measures at Jaipur’s Nahargarh Biological Park to protect animals from intense heat. Jumbo coolers and sprinklers have been installed throughout the park for the wildlife, and their diets have been modified.… pic.twitter.com/FI9RiZg0ve
— Press Trust of India (@PTI_News) April 24, 2026
