Viral Video | హోట‌ల్‌లో మూడు రోజులు బ‌స‌.. ట‌వ‌ల్స్, స్పూన్స్‌ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో

Viral Video | కొంత‌మంది టూరిస్టులు ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన ఆ ప‌ర్యాట‌కులు.. ఆ హోట‌ల్‌లో ఉన్న వ‌స్తువుల‌పై క‌న్నేశారు. ఆ వ‌స్తువులు వారి మ‌న‌సుకు న‌చ్చాయి. ఇంకేముంది.. ట‌వ‌ల్స్‌తో మొద‌లుకుంటే చివ‌ర‌కు స్పూన్ల‌ను కూడా దొంగిలించేశారు.

Viral Video | కొంత‌మంది టూరిస్టులు ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. మూడు రోజుల పాటు ఎంజాయ్ చేసిన ఆ ప‌ర్యాట‌కులు.. ఆ హోట‌ల్‌లో ఉన్న వ‌స్తువుల‌పై క‌న్నేశారు. ఆ వ‌స్తువులు వారి మ‌న‌సుకు న‌చ్చాయి. ఇంకేముంది.. ట‌వ‌ల్స్‌తో మొద‌లుకుంటే చివ‌ర‌కు స్పూన్ల‌ను కూడా దొంగిలించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇండోనేషియా బాలిలోని అస్వారా రిసార్ట్‌లో కొంత‌మంది ఇండియ‌న్ టూరిస్టులు ఈ నెల 16వ తేదీన దిగారు. ఇక బాలిలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను క‌లియ‌తిరిగారు. బీచ్‌లో ఎంజాయ్ చేశారు. రిసార్ట్‌లోని ఫుడ్‌ను కూడా ఆస్వాదించారు. 19వ తేదీ వ‌ర‌కు ఒకే హోట‌ల్‌లో బ‌స చేశారు.

ఇక హోట‌ల్ నుంచి చెక్ అవుట్ స‌మ‌యంలో.. సిబ్బందికి టూరిస్టుల ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల అనుమానం వ‌చ్చింది. ఇంకేముంది వారి బ్యాగుల‌ను త‌నిఖీ చేశారు. త‌నిఖీల్లో ఖ‌రీదైన పూల్ ట‌వ‌ల్స్, బాత్ ట‌వ‌ల్స్, డోర్ మ్యాట్, కిమోనో రోబ్స్, హెయిర్ డ్రైయ‌ర్, స్పూన్లు, టీవీ రిమోట్ బాక్సును వారి బ్యాగుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయి. హోట‌ల్ సిబ్బంది విస్తుపోయారు.

ఈ టూరిస్టులు ఇండియాకు చెందిన వారని స‌మాచారం. ఇలా దొంగిలించ‌డం స‌రికాద‌ని, భార‌తీయుల‌ను ఒక‌రు నిందిస్తున్న‌ట్లు వీడియోలో వినిపించింది. భార‌తీయులంద‌రూ అలా ఉండ‌ర‌ని మ‌రొక‌రు అన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

Latest News