Zika virus | విస్తరిస్తున్న జికా వైరస్ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..!

Zika virus | జికా వైరస్‌ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఇటీవల మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పుణెలో ఇద్దరు గర్భిణీలు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి.

  • Publish Date - July 3, 2024 / 08:01 PM IST

Zika virus : జికా వైరస్‌ కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఇటీవల మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పుణెలో ఇద్దరు గర్భిణీలు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. పాజిటివ్‌గా తేలిన వారికి నిరంతరం పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌ గర్భిణీల పిండాల పెరుగుదలను పర్యవేక్షించాలని సూచించింది.

పాజిటివ్‌ వ్యక్తులపట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. అలాగే ఈ వైరస్‌ సోకిన బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా కారణంగా మైక్రో సెఫాలీ అనే రుగ్మత వచ్చే అవకాశం ఉంది. పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని కేంద్రం సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకరాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Latest News