Site icon vidhaatha

ఇరాన్ పోర్టు పేలుడులో.. 25మంది దుర్మరణం

విధాత: ఇరాన్ లోని అతిపెద్ద నౌకాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 750 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్త సంస్థల కథనం. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ లోని రజేయి ఓడరేవులో జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. ఒక భవనం నేలకూలింది. దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. దీంతో ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న పాఠశాలలు, కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు, ఆయిల్ ట్యాంక్సు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్‌ హసన్జాదే చెప్పారు. పేలుడు వెనుక ఎలాంటి దాడి కుట్ర లేదని స్పష్టం చేశారు.

Exit mobile version