విధాత: ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బోగీలు విడిపోయిన ఘటనలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళుతున్న ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లోని ఏ1 ఏసీ బోగీ వద్ధ కప్లింగ్ ఊడిపోయి రైలులోని 15బోగీలు విడిపోయాయి. ప్రమాదంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు చర్యలు చేపట్టారు. విడిపోయిన 15బోగీలను రెండు ఇంజన్లతో మందస రోడ్ స్టేషన్ కు తరలించి అక్కడ తిరిగి జాయింట్ చేశారు. అనంతరం రైలు బయలు దేరింది. రైలు బోగీలు విడిపోయి గంటకు పైగా రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.