కె.కె.రంగనాథాచార్యులు ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా, ప్రధానాధ్యాపకులు (1967-87)గా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులు (1987-2003)గా పనిచేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్‌కి డీన్‌గా కూడా ఉన్నారు.
తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచిగా
ఎందరెందరో పరిశోధకులకు మార్గదర్శిగా
అనుపమాన గ్రంధాలు వెలువరించి
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి
దీప స్తంభంలా నిలిచారు. ప్రేరణాస్రోతమైన
వారి ప్రసంగాలు అసంఖ్యాక సాహిత్య వ్యాసాలు, వారు రచించిన గ్రంధాలు
తెలుగు సాహిత్య అధ్యయనం కీలక భూమికను నిర్వహిస్తున్నాయి.
వారి రచనలు.
*ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు.
*తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక
*తెలుగులో తొలి సమాజ కవులు
*తెలుగు సాహిత్య వికాసం
*నూరేళ్ల తెలుగునాడు.
*రాచకొండ విశ్వనాథశాస్త్రి.
*తెలుగు సాహిత్యం మరో చూపు
*తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం
*చందు మీనన్ (అనువాదం. మూలం: టి.సి.శంకర మీనన్ )
*తొలినాటి తెలుగు కథానికలుః మొదటినుంచి 1930 వరకు తెలుగు కథానికల పరిశీలన. వంటి ఎన్నో గ్రంథాలు కాక మరెన్నో సాహిత్య వ్యాసాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి ఆయన.
ఆయన లేని లోటు తెలుగు సాహిత్యంలో
తీర్చలేనిది. చివరి గడియల్లో అంతటి మహోన్నత వ్యక్తి కరోనా మహమ్మారికి బలై
ఆత్మీయులకు అభిమానులకు తెలుగు సాహిత్య అధ్యయన పరులకు
దూరం కావడం తట్టుకోలేని సందర్భం.
వారి మృతికి కన్నీటి నివాళి.