Site icon vidhaatha

Aishwarya Arjun | ఆ.. ప్రముఖ నటుడి కుమారుడితో అర్జున్‌ కూతురు వివాహం..! ఎవరంటే..?

Aishwarya Arjun | శాండల్‌వుడ్‌ నటి, ప్రముఖ నటుడు అర్జున్‌ సర్జ తనయ ఐశ్యర్య అర్జున్‌ కెరీర్‌లో దూసుకుపోతున్నది. పలు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నది. తన అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పనున్నది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.

ఐశ్యర్య చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఊహించని స్థాయిలో క్రేజ్‌ను సంపాదించింది. తమిళ సినిమా ‘పట్టుతు యానమ్‌’తో సినీరంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి వచ్చి పదేళ్లయినా తక్కువ సినిమాలే చేశారు. ఇటీవల అర్జున్‌ సర్జ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా.. ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా ఓ ప్రాజెక్టును ప్రకటించారు.

ఈ సినిమా ప్రారంభంలోనే ఆగిపోయింది. ఈ సినిమాను మరో హీరోతో కలిసి సెట్స్‌పైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్యర్య అర్జున్‌ వయసు 31 సంవత్సరాలు కాగా.. ఐశ్యర్య కోలీవుడ్‌ కమెడియర్‌ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ప్రేమలో ఉందని తెలుస్తుంది.

వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఐశ్వర్య పెళ్లిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉమాపతి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘లియో’ చిత్రంలో నటిస్తున్నాడు.

అయితే ఇటీవల పవన్‌కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ జంటగా సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ‘బ్రో’ సినిమా మాతృక వినోదాయసిత్తంలో తంబిరామయ్య, సముద్రఖని ప్రధానపాత్రదారులు. తమిళంలో తంబిరామయ్య పాత్రను తెలుగులో సాయిధరమ్‌ తేజ్‌ చేస్తుండడం విశేషం.

Exit mobile version