Site icon vidhaatha

Vijayashanti: ఎమ్మెల్సీ రేసులోకి.. రాములమ్మ!

Vijayashanti:

విధాత, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLAs Quota MLC) అభ్యర్థిత్వం కోసం ఆశావహులైన కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్సీ రేసులోకి నేనున్నానంటూ సీనియర్ నాయకురాలు.. మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) కూడా తెరపైకి వచ్చారు. గురువారం ఆమె ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని విజయశాంతి ఢిల్లీ పెద్దలను కోరినట్లు సమాచారం.

విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాతా పార్టీకి ఆమె అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తరుచు ట్వీట్టర్ ద్వారా పార్టీ.. ప్రభుత్వ విధానాలపైన స్పందించడం.. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు.

ఆకస్మాత్తుగా ఎమ్మెల్యే కోటా ఎన్నికల రేసులోకి రావడం పార్టీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. విజయ శాంతి ఢిల్లీలో తనకు తెలిసిన కాంగ్రెస్ అగ్రనేతల ద్వారా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

Exit mobile version