Aus Vs India:
విధాత: ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆసీస్ జట్ల జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టుల సీరీస్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మొదటి టెస్టులో భారీ విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో ఘోర పరాభవం చవిచూడగా గెలుపుతో అసీస్ నూతన ఉత్సాహం తెచ్చుకుంది. ఈక్రమంలో మూడవ టెస్టు బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14న ప్రారంభమైన మూడో టెస్టు డ్రా దిశగా సాగుతుంది.
రానున్న ప్రపంచ టెస్టు చాంఫియన్‌షిప్‌కు అర్హత సాధించేందుకు ఈ సిరీస్ కీలకమవడంతో రెండు టీముల మధ్య ఆట కూడా ఓ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ ఈ జట్ల మధ్య సాగే ఆటను తిలకించేందుకు స్టేడియాలకు క్యూ కడుతున్నారు. ఇటీవల ముగిసిన రెండో టెస్టు మ్యచ్‌ను వీక్షిచేందుకు మూడు రోజుల్లో 1,35,012 మంది ప్రేక్షకులు హాజరవడం విశేషం.
ఇదిలాఉండగా ఈ సిరీస్‌లో మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి 30వరకు జరిగే నాలుగో టెస్టు (బాక్సింగ్ డే)కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడం సంచలనంగా మారింది. కాగా ఈ స్టేడియం సామర్థ్యం లక్షకు మించి ఉండగా టెస్టుకు ఇంకా 15 రోజులకు పైనే సమయం ఉన్నప్పటికీ మొదటిరోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ క్షణాల్లో అమ్ముడవడం విశేషం. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్‌లో స్పష్టం చేసింది.