Betting Apps | Anchor Shyamala | High Court
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో వైసీపీ నాయకురాలు.. యాంకర్ శ్యామలకి హైకోర్టులో ఊరట లభించింది .తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో శ్యామల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు తెలిపింది. సోమవారం నుండి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చు అని హైకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పంజాగుట్టలో శ్యామల సహా 11మందిపైన, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25మందిపైన కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికో నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. రీతు చౌదరి, విష్ణుప్రియలను విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు.