Bihar Labour Attack on Police | పోలీసులను పరుగెత్తించిన బీహార్ కార్మికులు..ఉద్రిక్తత

సూర్యాపేట దక్కన్ సిమెంట్‌ ఫ్యాక్టరీలో బీహార్ కార్మికుల ఆందోళన, పోలీసులపై దాడి, గాయాలు, వాహనాలు ధ్వంసం.

bihar-labour-attack-on-police-at-deccan-cement-factory-suryapet

విధాత :సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బీహార్ కార్మికుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడిన బీహార్ కార్మికులు వారిపై దాడి చేసి పరుగెత్తించారు. పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడికి‌ దిగారు. కార్మికుల దాడిలోపలువురు పోలీసులకు గాయాలవ్వగా..రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి.

నిన్న దక్కన్ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో గాయపడిన ఓ కార్మికుడు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ మాట తప్పడంతో ఆగ్రహించిన కార్మికులు…న్యాయం చేయాలని కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఆఫీస్ మీద దాడి చేసి.., అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను చెదరగొట్టే సమయంలో కార్మికులకు పోలీసులకి మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసుల తీరును ఆక్షేపించిన కార్మికులు వారిపై కర్రలు, రాళ్ళతో దాడికి దిగి తరిమికొట్టారు.

బీహార్ కార్మికుల దాడి | సూర్యాపేట డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత | Police Vehicles Dhvamsam