ఇన్సిట్యూట్ ఆప్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(Institute of Charted Accountants of India – ICAI) నేడు చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్(CA final), ఇంటర్మీడియట్(CA Intermediate) పరీక్షల ఫలితాలను వెల్లడించింది. విద్యార్థులు వారి ఫలితాలను చూసుకోవడానికి ఐసిఏఐ అధికారిక వెబ్సైట్లు, …లను సందర్శించవచ్చు.
ఐసిఏఐ సిఎ ఇంటర్ గ్రూప్ 1 పరీక్షలను ఈ ఏడాది మే 3, 5, 9వ తేదీలలో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్షలను మే 11, 15, 17 వ తేదీలలో నిర్వహించారు. ఇక ఫైనల్ గ్రూప్ 1 పరీక్షలను మే 2, 4, 8వ తేదీలలో, గ్రూప్ 2 పరీక్షలను మే 10, 14, 16వ తేదీలలో పూర్తి చేసారు. ఫలితాలతో పాటు కీ వివరాలు, రిజిస్టర్ చేసుకున్న, పరీక్షలకు హాజరైన, అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య, ఉత్తీర్ణతాశాతం, తుది ఫలితాలు, టాపర్ల వివరాలను ఐసిఏఐ ప్రకటించింది.
ఐసిఏఐ గతంలో పరీక్షల్లో మోసానికి పాల్పడిన విద్యార్థులను గుర్తించి వారిపై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన సంస్థ, కొంతమంది పరీక్ష హాల్లోకి మొబైల్ఫోన్లతో వచ్చారని, వారిని గుర్తించి ఇంకా 5 ఏళ్ల వరకు పరీక్ష రాయకుండా డిబార్ చేసామని తెలిపింది. వారు ఐసిఏఐ ప్రతిష్టను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఏడాది మే సెషన్ పరీక్షల ఉత్తీర్ణతాశాతం ఈ విధంగా ఉంది. ఐసిఏఐ సిఎ ఇంటర్ గ్రూప్ 1(ICAI CA Inter Group 1) పరీక్ష ఉత్తీర్ణతాశాతం 27.15% కాగా, గ్రూప్ 2 (Inter Group 2)ఉత్తీర్ణతాశాతం 18.28%గా ఉంది. అలాగే ఫైనల్ గ్రూప్ 1 (CA Final Group 1)పరీక్ష పాస్ పర్సంటేజీ 27.35%గా ఉండగా, గ్రూప్ 2(Final Group 2)లో 36.35%గా నమోదయింది.
టాపర్లు వీరే..!( Toppers List)
ఈసారి టాపర్లుగా నిలిచిన వారి లిస్ట్‌ను కూడా ఐసిఏఐ విడుదల చేసింది. దాని ప్రకారం,
సిఏ ఫైనల్ 2024 టాపర్లు(CA Final 2024 Toppers)గా,
- న్యూఢిల్లీ నుండి శివమ్ మిశ్రా 83.33%తో ఫస్ట్ ర్యాంక్ – AIR 1
- న్యూఢిల్లీ నుండే వర్షా అరోరా 80% మార్కులతో 2వ ర్యాంక్ – AIR 2
- ముంబయి నుండి కిరణ్ రాజేంద్రసింగ్, నవీ ముంబయి నుండి ఘిల్మాన్ సలీం 89.50% మార్కులతో సంయుక్తంగా 3వ ర్యాంక్ సాధించారు – AIR 3
ఇక సిఎ ఇంటర్ 2024 పరీక్షల టాపర్లు(CA Inter 2024 Toppers)గా,
- భివాడీ, రాజస్థాన్‌కు చెందిన కుశాగ్ర రాయ్ 89.57% మార్కులతో ఫస్ట్ ర్యాంకు– AIR 1
- మహారాష్ట్రకు చెందిన యజ్ సచిన్ కరియా, యజ్ఞ లలిత్ చందక్ 87.67%తో సంయుక్తంగా రెండో ర్యాంకు– AIR 2
- ఢిల్లీ నుండి మన్జిత్సింగ్ భాటియా, ముంబయి నుండి హిరేశ్ కాశీరాంకా 86.50%తో సంయుక్తంగా మూడో ర్యాంకు – AIR 3 సాధించారు.
సిఏ ఫైనల్ ఉత్తీర్ణతాశాతాలు, గ్రూప్ 1 – 27.35%, గ్రూప్ 2 – 36.35 కాగా, మొత్తంగా రెండు గ్రూప్‌లు కలిపి 19.88%గా నమోదయింది.
ఫలితాలు చూసుకునే విధానం(How to check the Result):
- ముందుగా icai.nic.in పై క్లిక్ చేయండి.
- తరువాత మీరు రాసిన పరీక్షపై క్లిక్ చేయండి.
- మీ రోల్ నెంబర్‌ను, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను, క్యాప్చాకోడ్తో సహా సబ్మిట్ చేయండి.
- అంతే.. మీ ఫలితం మీ కళ్ల ముందే.