Snake | పాల‌మూరు జిల్లాలో అరుదైన పాము ప్ర‌త్య‌క్షం..

Snake | వర్షాకాలంలో పాములు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. కొన్ని అరుదైన పాములు కూడా క‌నిపిస్తుంటాయి. పాల‌మూరు జిల్లా ప‌రిధిలోని జ‌డ్చ‌ర్ల ప్రాంతంలో ఓ అరుదైన పాము ప్ర‌త్య‌క్ష‌మైంది. బైపాస్ ర‌హ‌దారికి స‌మీపంలోని అక్ష‌ర కాల‌నీలోని ఓ ఇంట్లోకి బుధ‌వారం రాత్రి ఓ పాము ప్ర‌వేశించింది. దీంతో పాముల సంర‌క్ష‌కుడు, జ‌డ్చ‌ర్ల ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ లెక్చ‌ర‌ర్ డాక్ట‌ర్ స‌దాశివ‌య్య‌కు స‌మాచారం అందించారు. ఈ అరుదైన పామును స‌దాశివ‌య్య ప‌ట్టేశాడు. ఈ పాము కోలుబ్రిడే సంత‌తికి చెందింద‌ని […]

  • Publish Date - September 3, 2023 / 10:42 AM IST

Snake |

వర్షాకాలంలో పాములు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. కొన్ని అరుదైన పాములు కూడా క‌నిపిస్తుంటాయి. పాల‌మూరు జిల్లా ప‌రిధిలోని జ‌డ్చ‌ర్ల ప్రాంతంలో ఓ అరుదైన పాము ప్ర‌త్య‌క్ష‌మైంది.

బైపాస్ ర‌హ‌దారికి స‌మీపంలోని అక్ష‌ర కాల‌నీలోని ఓ ఇంట్లోకి బుధ‌వారం రాత్రి ఓ పాము ప్ర‌వేశించింది. దీంతో పాముల సంర‌క్ష‌కుడు, జ‌డ్చ‌ర్ల ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ లెక్చ‌ర‌ర్ డాక్ట‌ర్ స‌దాశివ‌య్య‌కు స‌మాచారం అందించారు. ఈ అరుదైన పామును స‌దాశివ‌య్య ప‌ట్టేశాడు.

ఈ పాము కోలుబ్రిడే సంత‌తికి చెందింద‌ని తెలిపారు. దీని శాస్త్రీయ‌నామం లైకోడాన్ ఫావిక‌ల్లిస్ అని తెలిపారు. ఈ పాము మెడ‌పై ప‌సుపు రంగులో పెద్ద మ‌చ్చ ఉండ‌టం వ‌ల్ల ఎల్లో కాల‌ర్డ్ వుల్ఫ్ స్నేక్ అని పిలుస్తార‌ని పేర్కొన్నారు. ఇది విష‌ ర‌హిత స‌ర్ప‌మ‌ని, గ‌తంలో తెలంగాణ‌తో పాటు ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో క‌నిపించింద‌ని స‌దాశివ‌య్య తెలిపారు.

Latest News