snake-free countries: పాములు లేని దేశాలు ఇవే..

snake-free countries: పాము పేరు వినగానే చాలా మంది వణికిపోతుంటారు. దాని విషం ప్రాణాంతకం కావడమే అందుకు కారణం. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా మూడువేలకు పైగా పాముల జాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని విషపూరితమైనవి.. మరికొన్ని విషరహితమైనవి కూడా ఉన్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అసలు పాములు అనేవి కనిపించవు. ఆ దేశ భౌతిక, భౌగోళిక పరిస్థితులు తదితర కారణాల వల్ల అక్కడ పాములు కనిపించవు. అటువంటి దేశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.. న్యూజిలాండ్ న్యూజిలాండ్ […]

snake-free countries: పాము పేరు వినగానే చాలా మంది వణికిపోతుంటారు. దాని విషం ప్రాణాంతకం కావడమే అందుకు కారణం. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా మూడువేలకు పైగా పాముల జాతులు ఉన్నాయి. వీటిలో కొన్ని విషపూరితమైనవి.. మరికొన్ని విషరహితమైనవి కూడా ఉన్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అసలు పాములు అనేవి కనిపించవు. ఆ దేశ భౌతిక, భౌగోళిక పరిస్థితులు తదితర కారణాల వల్ల అక్కడ పాములు కనిపించవు. అటువంటి దేశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..

న్యూజిలాండ్

న్యూజిలాండ్ దేశంలో ఒక్క పాము కూడా కనిపించదు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఈ దేశం భౌగోళికంగా ఇతర ఖండాల నుండి వేరుపడి ఉండటం వల్ల పాములు ఇక్కడ సహజంగా వలస వెళ్లలేకపోయాయి. ఈ దేశంలో కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు అమలులో ఉన్నాయి. ఇక ఇక్కడ పాములను పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు. అంతేకాక జూలోనూ పాముల జాడ కనిపించదు.

ఐర్లాండ్

ఐర్లాండ్ పాములు లేని దేశంగా ప్రసిద్ధి చెందింది. ఐర్లాండ్‌లో పాములు ఎన్నడూ లేవని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ సమయంలో ఐర్లాండ్ చల్లని వాతావరణం కలిగి ఉండటం, ఆ తర్వాత సముద్ర జలాలు బ్రిటన్‌తో ఉన్న ల్యాండ్ బ్రిడ్జిని ముంచెత్తడం వల్ల పాములు ఇక్కడకు చేరుకోలేకపోయాయని చెబుతూ ఉంటారు. ఐర్లాండ్‌లో పాములను పెంచుకోవడం చట్ట విరుద్ధం. అందుకే ఈ దేశంలో పాములు కనిపించవు.

ఐస్‌లాండ్

ఐస్‌లాండ్‌లోని ఉప ఆర్కిటిక్ వాతావరణం పాములకు అనుకూలంగా లేదు. ఈ దేశంలో చల్లని ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ శీతాకాలాలు పాములు జీవించడానికి అవసరమైన వెచ్చదనాన్ని అందించవు. ఇక్కడ ఆర్కిటిక్ ఫాక్స్ మాత్రమే స్థానిక జంతువుగా ఉంది. పాములను దిగుమతి చేయడంపై కఠిన నిషేధం ఉంది, జూ లలో కూడా అరుదుగా మాత్రమే అనుమతి ఉంటుంది.

గ్రీన్‌లాండ్

ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్‌లాండ్‌లో పాములు లేని మరో దేశం. ఇక్కడ అత్యంత చల్లని వాతావరణం ఉంటుంది. శీతలగాలులు విస్తరిస్తూ ఉంటాయి. తక్కువ సూర్యకాంతి పాములకు అనుకూలమైన వాతావరణం కాదు. అందుకే ఇక్కడ పాములు కనిపించవు. అంతేకాక ఈ దేశంలో ఎవరైనా పాములు పెంచాలంటే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

కేప్ వెర్డే

ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న కేప్ వెర్డే దీవులు కూడా పాములు లేని దేశంగా గుర్తించబడ్డాయి. ఈ దీవులు భౌగోళికంగా పాములకు అనుకూలంగా లేకపోవడంతో పాములు ఇక్కడకు చేరుకోలేకపోయాయని చెబుతూ ఉంటారు. ఇక్కడ విషపూరిత జంతువులు కూడా చాలా తక్కువే. ఈ ప్రాంతం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటు నౌరు, కిరిబాటి, మార్షల్ దీవులు వంటి అనేక చిన్న పసిఫిక్ దీవుల్లోనూ పాముల ఆనవాళ్లు కనిపించవు.