విధాత : మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా డిండోరీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో శివాజీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయింది. ప్రమాదంలో కారులో ఉన్న తొమ్మది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు..ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రెండు క్రేన్లు, గజ ఈతగాళ్ల సాయంతో కారుతో పాటు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. ఈ ఘటనలో సునీల్ దత్తు దర్గుడే(32), ఆయన భార్య రేష్మా, మరో కుటుంబ సభ్యురాలు ఆశా అనిల్ దర్గుడే(32)తో పాటు వీరి కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు మృతి చెందారు. మృతుల్లో పదకొండేళ్ల బాలుడు, 7-14 ఏళ్ల వయసు మధ్యనున్న అయిదుగురు అమ్మాయిలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
Ramayana | ఓటీటీ మార్కెట్‌లో రామాయణ హవా.. వారణాసిని మించి మరీ.. ?
Petrol | వాహనదారులకు గుడ్‌న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ. 80 తగ్గింపు
