Rashmika | పెళ్లి తర్వాత గ్లోబల్ స్టేజ్‌పై మెరవ‌నున్న‌ రష్మిక మందన్నా… క్రంచీరోల్ అవార్డ్స్‌లో అరుదైన‌ ఘనత

Rashmika | పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని చాటేందుకు సిద్ధమవుతోంది. అభిమానులు ప్రేమగా “నేషనల్ క్రష్” అని పిలుచుకునే ఈ అందాల తార, వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసిన తర్వాత కెరీర్‌లో మరింత ఎత్తుకు చేరుతోంది.

Rashmika Mandanna

Rashmika | పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని చాటేందుకు సిద్ధమవుతోంది. అభిమానులు ప్రేమగా “నేషనల్ క్రష్” అని పిలుచుకునే ఈ అందాల తార, వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసిన తర్వాత కెరీర్‌లో మరింత ఎత్తుకు చేరుతోంది.

వైవాహిక జీవితంలో కొత్త అధ్యాయం

ఇటీవలే విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక… ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పుడు తెలుగింటి కోడలిగా అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

వరుసగా రెండోసారి అంతర్జాతీయ గౌరవం

జపాన్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక క్రంచీరోల్ యానిమే అవార్డ్స్‌లో రష్మిక వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా ఎంపిక కావడం విశేషం. 2024లో మొదటిసారి ఈ వేదికపై మెరిసిన ఆమె… ఇప్పుడు మళ్లీ అదే వేదికపై కనిపించబోతోంది. మే 23న టోక్యోలో జరగనున్న ఈ అవార్డ్స్ వేడుకలో హాలీవుడ్ ప్రముఖులతో కలిసి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఈ గౌరవాన్ని రెండుసార్లు అందుకున్న తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రష్మిక రికార్డు సృష్టించింది.

‘శ్రీవల్లి’తో జపాన్‌లో క్రేజ్

పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి’ పాత్రతో రష్మికకు జపాన్‌లో విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ఆమె నటన, ఎక్స్‌ప్రెషన్స్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల యానిమల్, పుష్ప 2, ‘కుబేర’, ‘గర్ల్ ఫ్రెండ్’, ‘థామా’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న రష్మిక… ప్రస్తుతం ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాల్లో నటిస్తోంది.

‘రణబాలి’ చిత్రంలో మరోసారి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంటగా కనిపించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.మొత్తానికి, రష్మిక మందన్నా వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండింటినీ సమతూకంగా కొనసాగిస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతోంది. క్రంచీరోల్ అవార్డ్స్ వేదికపై ఆమె మెర‌వ‌డం… మరోసారి భారతీయ సినీ అభిమానులను గర్వపడేలా చేయనుంది.

Latest News