Site icon vidhaatha

Rasi Phalalu | మార్చి13, గురువారం.. ఈ రోజు మీ రాశి ఫలాలు! వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు

Rasi Phalalu|

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచినప్ప‌టి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు శివ‌రాత్రి (గురువారం, మార్చి 13) న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
ప్రభుత్వఉద్యోగులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. కావాల్సిన ధనం సకాలంలో చేతి కందుతుంది. మంచి పనులు చేయు అవకాశం లభిస్తుంది.

వృషభం
ఇష్టమైన వస్తువులు నష్టమగును. అపవాదుల మూలకంగా మనోశ్లోభ ఉంటుంది. వ్యాపారస్థులకు అనుకూలముగా సమయం కాదు. భయం వలన కార్యభంగములు క‌లుగవచ్చును. శరీర అలసట ఎక్కువ.

మిథునం
కోర్టు కేసులను వాయిదా వేసుకోవడం మంచిది. సంభాషలలో మాటలను అదుపులో ఉంచుకోనుట మంచిది. మీకు తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెడుదురు, ఆలోచనలు ఎక్కువగా వుండవచ్చును.

కర్కాటకం
దూరప్రాంతాల‌ నుంచి శుభవార్తలు వింటారు. నూతన వస్తువులను పొందుతారు. ఆత్మస్థైర్యము వుంటుంది. ఇష్టమైన వ్యక్తులకు మీ అంతరంగాన్ని వెల్లడిస్తారు. భూసంబంధమైన వ్యవహారాలకు అనుకూలంగా వుంటుంది.

సింహం
ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవటం వలన నిరాశ పొందుతారు, గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. నిందలను వినవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చును.

కన్య
రాజకీయ నాయకులకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గౌరవము పెరుగుతుంది. నూతన కార్యారంభమునకు అనుకూలము. బహుమానములను పొందుతారు. శుభకార్యములకు ధనాన్ని వెచ్చిస్తారు.

తుల
దూరప్రయాణాలు వెల్లవలసి వస్తుంది. దుర్జ‌నుల సహవాసము కలుగుతుంది. ఒళ్ళుఇప్పులు బాధించవచ్చును. కొన్ని వివాదములలో తలదూర్చవలసి రావచ్చును. అనవసర ధనవ్యయము కలుగవచ్చును.

వృశ్చికం
ప్రముఖులతో కలయికలు. దానధర్మాది పుణ్యకార్యములను ఆచరించెదరు. ఇంట్లో శుభకార్యములు లేదా బంధుమిత్రుల కలయికలు వుండవచ్చును. సంతానమునకు సంతోషాన్ని కలిగిస్తాను, ఆనందంగా రోజు గడుస్తుంది.

ధనుస్సు
తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్ర‌యత్నాలు ప్రారంభిస్తారు. శరీర సౌఖ్యము వుంటుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకొంటారు.

మకరం
సోద‌ర వర్గము వారితో అభిప్రాయ భేదాలు క‌లుగుదతాయి. ఉద్యోగములో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకొని సమస్యలు ఎదుర్కొంటారు. పరస్థలంలో గడపవలసి వస్తుంది. అనారోగ్య భయము వుంటుంది.

కుంభం
క్రీడాకారులకు ఇబ్బందులెదురవుతాయి, శరీరంలో వాత బాధలు కలుగవచ్చును. ఇష్టములేని పనులు చేయవలసి వస్తుంది. భయం మూలకంగా పనులు ఆలస్యం కావచ్చును. శ‌త్రవులతో వివాదాలు పెరగవచ్చును.

మీనం
రాజకీయ నాయకులు ఆదరణ‌ పనులు పూర్త‌వుతాయి. భూవివాదాలు. పరిష్కారమయ్యే సూచనలు. కీర్తి, సన్మానములు పొందుదురు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపెదరు, రాద‌నుకున్న ధనము చేతికందుతుంది.

Exit mobile version