Site icon vidhaatha

DJ Tillu Square | ఈ టిల్లు‌గాడి తర్వాతే ఎవరైనా.. అనుపమాని కూడా దించేశాడు

DJ Tillu Square |

విధాత‌: ‘డిజే టిల్లూ పేరు.. వీడి స్టైలే వేరు, సోకేమో హీరో తీరు.. కొట్టేది తీన్మారూ’ అంటూ జనాల్ని ఓ ఊపు ఊపేశాడు టిల్లు గాడు. చిన్న బడ్జెట్‌తో వచ్చి.. భారీ కలెక్షన్స్‌ని తన ఖాతాలో వేసుకుని సూపర్ హిట్ కొట్టేసింది ‘డిజే టిల్లు’ మూవీ. ప్రత్యేకమైన డైలాగ్స్‌తో, డిఫరెంట్ మేకింగ్‌తో, హీరోకి మాత్రమే సెట్ అయిన యాటిట్యూడ్‌తో.. మొత్తానికి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఓ ఫీల్‌తో ఆ సినిమా పడేసింది.

అలాంటి ‘డిజే టిల్లు’ మూవీతో ఒక్కసారిగా సిద్దూ జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ‘గిదేంది రాధికా’.. ‘గట్లుంటది మనతోని’.. వంటి డైలాగులైతే ప్రేక్షకుల నోళ్ళల్లో ఇంకా పేలుతూనే ఉన్నాయి. ‘డిజే టిల్లు’ కామెడీకి కాస్త కొత్త రూట్ చూపించింది. ఆద్యంతం నవ్వులు పూయించే ఈ మూవీకి సీక్వెల్ అని ప్రకటించగానే ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు మూవీ అభిమానులంతా.

అయితే సిద్ధూనే ఆ సినిమా కథ రాసుకుని, మూవీకి బ్యాక్ బోన్‌గా నిలిచాడనే విషయం చాలామందికి తెలియదు. ఇంతక ముందు కూడా సిద్దూ చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అయితే డిజే టిల్లు కథ ఓ కొత్త పంథాలో సాగుతుంది. కామెడీ పరంగా కేక పుట్టించింది.

ఇక డిజే టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ పేరుతో మొదలైంది కానీ పట్టాలెక్కే సమయంలో చాలా వాయిదాలను తీసుకుంది. బ్రేకులు పడుతూ కొన్ని సార్లు హీరోయిన్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మొత్తానికి గండాలన్నీ దాటుకుని ఇప్పుడు ఈ మూవీలో మొదటి సాంగ్ రిలీజ్ అయింది.

‘టిల్లు స్క్వేర్’ మూవీలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మళ్లీ డిజే టిల్లు దుమ్ము రేపబోతున్నాడనేలా టాక్‌కి కారణమవుతున్నాయి. నిజంగా ఫస్ట్ పార్ట్ కంటే కూడా మంచి హైప్ వస్తోంది.. అందుకు కారణం అనుపమా పరమేశ్వరన్.

ఈ పాట ప్రారంభానికి ముందు అనుపమను ఫ్లట్ చేస్తూ టిల్లూ వాడే డైలాగ్స్, డిల్లూ గెటప్‌కి తగ్గట్టుగా ఉన్న అనుపమ బాడీలాంగ్వేజ్, హెయిర్ స్టైల్ అన్నీ సెట్ అయ్యాయనిపిస్తుంది. ఇక మూవీ టైటిల్‌కి కూడా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్‌గా ఉండబోతుందనే హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.

ఈ సాంగ్‌లో అనుపమ, సిద్దూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లుగా కనిపిస్తుంది. రాధిక వెనకాలపడి పడిన పాట్లు సరిపోలేదా.. మళ్లీ సొరచేప వెనక గాలం ఎందుకంటూ సాగే పాట స్టోరీ గురించి కాస్త హింట్ ఇస్తున్నా కూడా అనుపమతో ఎలా వర్కవుట్ చేశాడో చూడాల్సిందేననిపించేలా ఉంది.

ఇక మూవీ మేకింగ్ కూడా వీడియోలో చూపించడం ఇంకా నప్పింది. టిల్లూగాడు కిరాక్ ఈడు అంటూ సాగే సాంగ్ వెనక మూవీ మేకింగ్ అన్నీ కలగలిపి సినిమాపై హైప్ పెంచుతున్నాయి. పార్ట్‌ 1లో నేహా శెట్టి ఏమో గానీ.. పార్ట్ 2లో అనుపమ అనగానే ఎక్కడా లేని క్రేజ్ ఈ ప్రాజెక్ట్‌కి వచ్చేసింది.

ఎందుకంటే.. మొన్నటి వరకు అనుపమ చాలా పద్ధతిగా, పక్కింటి అమ్మాయిలా కనిపించింది. కానీ ఈ మధ్య పద్ధతి పక్కన పెట్టేసింది. లిప్‌లాక్స్ కూడా ఇస్తోంది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయినట్లుగా ఈ పాటతోనే అర్థమైపోతుంది. మరి అనుపమ గింగిరాల జుట్టు.. మూవీతో పాటు హీరోని ఎన్ని గింగిరాలు తిప్పనుందో.. వెయిట్ అండ్ సీ.

Exit mobile version