విధాత: ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ పై ఈడి దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ హర్యానా సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఎకౌంట్లు నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుపై కొద్దిరోజుల క్రితం ఈడీ దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు సహా దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన వైట్ కాలర్ టెర్రర్ మ్యాడ్యుల్‌కు స్థావరంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ మారింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ జావేద్ అహ్మద్ సిద్ధికి గతంలో ఆర్థిక మోసాల కేసులో అరెస్టై మూడు సంవత్సరాలు తిహార్ జైల్లో ఉన్నాడు. ఆర్థిక నేరాల కేసులో తాజాగా సిద్ధికి సోదరుడు అహ్మద్ సిద్ధికిని హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా.. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్‌కు ఈ యూనివర్సిటీ నుంచే పథకాలు రచించారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న 32 కార్లతో భారీ దాడులు చేయాలని ఉగ్ర డాక్టర్లు పథకం పన్నినట్లు విచారణలో వెల్లడైంది. 70 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి 27 కి.మీ దూరంలో ఉంది.
