Site icon vidhaatha

DBS: వృద్ధుల సంరక్షణ.. అవార్డు అందుకున్న హైదరాబాద్ సంస్థ

హైదరాబాద్: డీబీఎస్ ఫౌండేషన్ ఇంపాక్ట్ బియాండ్ అవార్డ్ 2024 పురస్కారాన్ని అందుకున్న నాలుగు అంతర్జాతీయ సంస్థల్లో ఒకటిగా హైదరాబాద్‌కి చెందిన సామాజిక సంస్థ లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్ నిల్చింది. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న సమాజాల్లో, వారి అవసరాలను తీర్చే ప్రభావవంతమైన వ్యాపార సంస్థలకు దన్నుగా నిల్చేందుకు ఉద్దేశించి గతేడాదే ఈ అవార్డు ప్రారంభించబడింది. పురస్కారం కింద లైఫ్ సర్కిల్‌కి గ్రాంటు కింద 5,00,000 సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 3 కోట్లు) నిధులతో పాటు డీబీఎస్ ఫౌండేషన్ విస్తృత వ్యవస్థ తోడ్పాటు కూడా లభిస్తుంది. నిపుణుల మెంటార్‌షిప్, సామర్థ్యాలను పెంపొందించుకోవడం, భాగస్వామ్యం/నెట్‌వర్కింగ్ అవకాశాలు మొదలైనవి పొందవచ్చు. డీబీఎస్ ఫౌండేషన్ ప్రకటించిన 3 మిలియన్ సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 20 కోట్ల) నిధులను అందుకున్న నాలుగు సంస్థల్లో లైఫ్ సర్కిల్ కూడా ఒకటి. విజేతలకు ఫండింగ్‌తో పాటు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, కార్యకలాపాలను విస్తరించడం, సామర్థ్యాలను పెంపొందించుకోవడం సహా తదుపరి దశ వృద్ధికి అవసరమైన తోడ్పాటు కూడా బ్యాంకు నుంచి లభిస్తుంది.

సమాజంపై సానుకూల ప్రభావం చూపే వినూత్నమైన, నిర్దిష్ట లక్ష్యాల ఆధారితమైన వ్యాపారాలకు ప్రోత్సాహం అందించే దిశగా డీబీఎస్ ఫౌండేషన్ దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి డీబీఎస్ ఫౌండేషన్ ఇంపాక్ట్ బియాండ్ అవార్డ్ అనేది ఒక కొనసాగింపులాంటిది. ఆసియావ్యాప్తంగా బలహీన వర్గాల జీవితాలు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు, మరింత సమ్మిళితత్వంతో కూడుకున్న విధంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంపై ఫౌండేషన్‌కి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డెమోగ్రాఫిక్స్‌పరంగా చాలా దేశాల్లో వయస్సు మీద పడుతున్న జనాభా పెరుగుదల వంటి మార్పులు, ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గౌరవంగా, సంతోషంగా వృద్ధాప్యంలోకి మళ్లడాన్ని ఆస్వాదించేలా, ఆరోగ్యకరంగా, కనెక్టెడ్‌గా, సమాజంలో అర్థవంతమైన పాత్రను పోషించే విధంగా ఉండేలా సీనియర్లకు సాధికారత కల్పించేందుకు డీబీఎస్ ఫౌండేషన్ కట్టుబడి ఉంది. UNFPA రూపొందించిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం 2050 నాటికి భారతదేశంలో వృద్ధుల జనాభా సుమారు 20 శాతం పైగా చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇలా డెమోగ్రాఫిక్స్‌పరమైన మార్పులు వేగవంతమయ్యే కొద్దీ, అందరికీ అందుబాటు స్థాయిలో ఉండే ప్రొఫెషనల్ ఎల్డర్‌కేర్ సర్వీసులను అందించడమనేది అత్యవసరంగా మారుతోంది.

ఆ అంతరాలకు దూరం..

వ్యక్తిగత, ఆరోగ్య సంరక్షణ అవసరాలున్న కుటుంబాలకు సుశిక్షితులైన సంరక్షులను అనుసంధానం చేసే టెక్ ఆధారిత మార్కెట్‌ప్లేస్‌గా లైఫ్ సర్కిల్ ఈ అంతరాలను భర్తీ చేస్తోంది. భారత్‌లో శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్, మేనేజ్డ్ హోమ్ కేర్ సేవలన్నింటినీ ఒకే బ్రాండ్ కింద అందిస్తున్న ఏకైక ఫుల్-స్టాక్ ఎల్డర్‌కేర్ కంపెనీగా సంస్థ నిలుస్తోంది. లైఫ్ సర్కిల్ యొక్క హైబ్రిడ్ (ఫిజిటల్) మోడల్‌లో మొబైల్ యాప్, కేర్‌గివర్ ట్రైనింగ్, నాణ్యత పరీక్షలు మొదలైనవి నాణ్యమైన హోమ్-బేస్డ్ ఎల్డర్‌కేర్ సేవలు అందించడంలో తోడ్పడుతుంది. ఇలాంటి సేవలకు అత్యధికంగా డిమాండ్ ఉంటున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు, కొత్తగా ట్రైనింగ్ అకాడెమీలు ఏర్పాటు చేయడం, డిజిటల్ లెర్నింగ్ సాధనాలను ఆవిష్కరించడం, సంరక్షకుల కోసం ఆన్‌బోర్డింగ్‌, నాణ్యతను మెరుగ్గా నిర్వహించడం మొదలైన వాటికి ఈ అవార్డు తోడ్పడుతుంది. “సమాజాలు చాలా వేగంగా వృద్ధాప్యంలోకి మళ్లుతున్నాయి. అయిదేళ్ల లోపు పిల్లల కన్నా 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య ప్రపంచంలో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో డీబీఎస్ ఫౌండేషన్ యొక్క ఇంపాక్ట్ బియాండ్ అవార్డ్ తొలి బ్యాచ్ విజేతలు తమ వ్యాపారానికంటూ నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని, వృద్ధాప్యంలోకి మళ్లుతున్న సొసైటీల అవసరాలను తీర్చే సొల్యూషన్స్‌ను అందిస్తుండటం సంతోషకరమైన విషయం.

భారత్‌లో చాలా మటుకు ఎల్డర్‌కేర్ సేవలు అసంఘటితంగానే ఉంటున్నాయి. కేర్‌గివర్ శిక్షణ ద్వారా గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పిస్తూనే మరోవైపు ఎల్డర్‌కేర్‌ను మరింత ప్రొఫెషనల్‌గా, నిర్మాణాత్మకంగా, మరింత అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దడం ద్వారా ఈ కీలకమైన అంతరాన్ని భర్తీ చేసేందుకు లైఫ్ సర్కిల్ ప్రయత్నిస్తోంది. ఇంపాక్ట్ బియాండ్ అవార్డ్ విజేతల్లాంటి వారికి మద్దతుగా నిలవడం ద్వారా ప్రతి ఒక్కరు, జీవితంలోని ప్రతి దశలోనూ పెరిగే వయస్సును గౌరవప్రదంగా, సంతోషంగా ఆస్వాదించేందుకు తోడ్పడేలా భవిష్యత్తును నిర్మించాలని మా సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది” డీబీఎస్ ఫౌండేషన్ మరియు డీబీఎస్ గ్రూప్ స్ట్రాటెజిక్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ కరెన్ నిగుయి (Karen Ngui) తెలిపారు. “డీబీఎస్ ఫౌండేషన్ ఇంపాక్ట్ బియాండ్ అవార్డు లభించడం మాకెంతో గౌరవప్రదమైన విషయం. ఒక్కొక్కరు చొప్పున కేర్‌గివర్లను తీర్చిదిద్దుతూ, దేశీయంగా ఎల్డర్‌కేర్ మౌలిక సదుపాయాలను కల్పించాలన్న మా లక్ష్యాన్ని ఈ గుర్తింపు మరింత పటిష్టం చేసింది. డీబీఎస్ ఫౌండేషన్ మద్దతుతో అట్టడుగు వర్గాల యువతకు శిక్షణనిచ్చేందుకు, అలాగే సీనియర్లకు గౌరవప్రదమైన సంరక్షణ అందేలా చూసేందుకు మేము చేస్తున్న కృషికి మరింత ఊతం లభిస్తుంది” అని లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో అనంత్ కుమార్ తెలిపారు.

Exit mobile version