Site icon vidhaatha

Falcon Investment Scam | ఫాల్కన్ స్కామ్ లో రూ.18.14కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ

falcon-scam-ed-attaches-properties-worth-18-crore-invoice-discounting-scam

Falcon Investment Scam | విధాత, హైదరాబాద్ :ఫాల్కన్ కుంభకోణం కేసులో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తులో భాగంగా రూ.18.14కోట్ల విలువైన 12స్థిరాస్థులను అటాచ్ చేసినట్లుగా ఈడీ పేర్కొంది. అమర్‌దీప్ కుమార్ నేతృత్వంలోని మెస్సర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.792 కోట్లు మోసం చేసినట్లుగా ఈడీ విచారణలో గుర్తించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజలను మోసం చేసినట్లుగా ఈడీ అభియోగాలు మోపింది.

మోసపూరితంగా పొందిన నిధులతో నిందితులు అనేక కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడిగా ఉపయోగించారని, కంపెనీలకు రుణాలు, ప్రవైట్ జెట్ విమానం కొనుగోలు, క్యాసినోలలో పెట్టుబడులు పెట్టారని..అమర్‌దీప్ కుమార్, అతని కుటుంబ సభ్యుల పేరిట స్థిరాస్తుల కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈడీ అటాచ్ చేసిన స్థిరాస్తులు అమర్‌దీప్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, మెస్సర్స్ రెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రెట్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్నాయి. ఈడీ గతంలో మార్చి 7, 2025న సోదాలు నిర్వహించిన సందర్బంలో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ ‘హాకర్ 800ఏ’ను ఈడీ స్వాధీనం చేసుకుంది.

Exit mobile version