Rasi Phalalu, Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నుంచి చెరగని నమ్మకం. లేచిన సమయం నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల పేర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
నూతన కార్యాలకు ఆటంకాలు, కార్యాల్లో సత్ఫలితాలు. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం ఎదురుచూపు. దైవదర్శనం . ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు తగ్గ లాభాలు. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాలు.
వృషభం
కొత్తకార్యాలు ప్రారంభం. మానసిక ఆనందం పొందుతారు. వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం . వృత్తిరీత్యా కొత్త సమస్యలు. బంధు, మిత్రులతో సౌఖ్యంగా ఉండాలి. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం.
మిథునం
నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనయోగం. దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాలు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది
కర్కాటకం
విదేశీయాన ప్రయత్నాలు అనుకూలం. అనారోగ్య బాధలు అధికం. ఆకస్మిక ధననష్టం. బంధు, మిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం. అనవసర వ్యయప్రయాసలు. ప్రయాణాలు అధికం. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి. కుటుంబ వ్యవహారాలు చక్క బెడతారు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం
సింహం
నూతన కార్యాలు వాయిదా. విదేశీయాన ప్రయత్నం నెరవేరుతుంది. మనోవిచారం తప్పదు. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. ఆకస్మిక ధననష్టం. అధిక ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఉద్యోగం విషయంలో అధికారుల నుంచి శుభవార్తలు.ఆస్తి సమస్యలు ఓ కొలిక్కి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు
కన్య
పిల్లల నుంచి శుభవార్తలు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధననష్టం. మానసిక ఆందోళన. వృత్తి, వ్యాపారాల్లో పని భారం, ఇంక్రిమెంట్లు. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు. ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. ఆదాయం వృద్ధి
తుల
మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తుల సమస్యలు పరిష్కారం. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవ హారాల్లోపొరపాట్లకు అవకాశం. ఖర్చులు తగ్గించుకుంటారు. అనారోగ్య సమస్యలు ఎండవు.
వృశ్చికం
ఆకస్మిక ధనలాభం. కొత్త వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో విజయాలు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం. ప్రశాంతంగా కుటుంబ వాతావరణం. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. పని భారం పెరిగే అవకాశం ఉంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగరీత్యా ప్రయాణాలు. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. బంధువుల రాక.. కుటుంబంలో సందడి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు అధికం. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు.
మకరం
అనుకూల స్థానచలనం. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఇతరుల నుంచి విమర్శలు. అస్థిరమైన నిర్ణయాలు . ఆకస్మిక ధన వ్యయం. బంధు, మిత్రులతో విరోధాలు. రుణ ప్రయత్నాలు ఎక్కువ. లాభదాయకంగా వృత్తి, వ్యాపారాలు. ఉద్యోగంలో ప్రాధాన్యం. అధికార యోగానికి అవకాశం.
కుంభం
బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. మానసిక ఆందోళనలు. ఆకస్మిక ధన నష్టం. స్థిరమైన నిర్ణయాలు ఉండవు. అధికారులతో మర్యాదగా ఉండాలి. అనవసర భయం. ఆశాజనకంగా ఆర్థిక పరిస్థితి. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి. పలు శుభవార్తలు అందుతాయి.
మీనం
ఆకస్మిక ధన యోగం. సాఫీగా ఉద్యోగ జీవితం. అనుకోని ఖర్చులు తప్పవు. కుటుంబంతో సంతృప్తి. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. అంతటా అనుకూల వాతావరణం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం. బంధు, మిత్రులు కలుస్తారు. బంధుమిత్రులతో అపార్థాలు. ఉద్యోగంలో పనిభారం