విధాత: రామ్‌చరణ్ (Ram Charan) గేమ్ చేంజర్ (Game Changer) సినిమా విడుదల తగ్గర పడుతున్న కొద్ది క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హంగామా మొదలైంది. ఈక్రమంలో తాజాగా ఆదివారం సాయంత్రం విజయవాడలో చరణ్ భారీ కటౌట్‌ను దిల్ రాజు (Dil Raju) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను కేవలం కటౌట్ ఓపెనింగ్ కోసం మాత్రమే రాలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారిని కలవడానికి కూడా వచ్చాను అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
ఇంకా ఇయన మాట్లాడుతూ.. గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ అది ప్రేక్షకుల వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది జనవరి 1న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అమెరికాలో చేసిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5న ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఫిక్స్ అవుతాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి.
ఇక్కడకు వచ్చే ముందే చిరంజీవి (Chiranjeevi) గారికి ఫోన్ చేశాను. అప్పుడు సినిమా చూశారు కదా.. ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయింది.. మరోసారి సినిమా చూడండని అడిగా వాళ్లు అక్కడ సినిమా చూడటం స్టార్ట్ చేశారు. నేను ఇక్కడకు బయల్దేరాను. ఇక్కడకు వచ్చిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదని ఫ్యాన్స్‌కు చెప్పండి అని చిరంజీవి గారు అన్నారు.
మెగా పవర్ స్టార్‌లో మెగాని, పవర్‌ని చూస్తారు. నాలుగేళ్ల క్రితం శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఏం ఫీల్ అయ్యానో.. చిరంజీవి గారు ఒక్కో సీన్ గురించి చెబుతూ ఉంటే అదే ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది. రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతోన్నారు, ఎస్ జే సూర్య, రామ్ చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. జనవరి 1న ట్రైలర్, జనవరి 10న సినిమా రాబోతోంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి’ అంటూ పిలుపునిచ్చారు.