విధాత: టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మన జానియర్ ఎన్టీఆర్ (JR. NTR) హాలీవుడ్ చిత్రంతో అలరించనున్నట్లు వార్తలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేకపోయినా ఆ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
RRR సినిమాతో ఎన్టీఆర్ హాలీవుడ్ ఆడియెన్స్, టెక్నీషియన్స్‌ను సైతం మెస్మరైజ్‌చేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది దర్శకులు ఇటీవల ఇండియన్ నటీనటులపై దృష్టి సారించారు. ఈక్రమంలో ఇప్పటికే అలియాభట్ ఓ భారీ సినిమాలో నటించగా, ధనుష్ సైతం మెప్పించాడు. ఇప్పుడు అదే బాటలో జూనియర్ ఉన్నాడు.
ఈ నేథ్యంలో హాలీవుడ్‌లో ‘సూసైడ్ స్క్వాడ్,’ సూపర్ మ్యాన్ (Superman), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ (Guardians of the Galaxy) వంటి భారీ చిత్రాలను డైరెక్ట్ చేసిన ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ గన్ (James Gunn) ఇటీవల ఇటీవల ఓ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే అందుకు నిదర్శనం.
ఆ ఇంటర్వ్యూలో ఆయన ఓ సందర్భంలో RRR సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో జూ. ఎన్టీఆర్ గురించి చెప్పి ఆకాశానికెత్తేశారు. ఎన్టీఆర్ నటన ఎంతో ఆకట్టుకుందని, అతనితో పని చేయాలని కుతుహాలంగా ఉందని, ఏదో ఒక రోజు సినిమా తప్పక చేస్తానని ఆయన చెప్పారు.దీంతో త్వరలోనే ఈ వార్త నిజం కాబోతుందని ఎన్ఠీఆర్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.