Banakacharla | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పోలవరం, బనకచర్ల లింకేజ్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనక చర్లకు పర్యావరణ అనుమతులను కేంద్రం తిరస్కరించింది. ఈ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు ఉన్నయని పేర్కొన్నది. దీనికి అనుమతి ఇవ్వాలంటే జీడబ్ల్యూడీటీ అవార్డును పరిశీలించాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు జీడబ్ల్యూడీటీ తీర్పు ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయని కమిటీ పేర్కొన్నది. బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైన సంగతి తెలిసిందే. పైగా.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఎందుకూ పనికిరాదని ఆంధ్ర ఆలోచనాపరుల వేదిక సైతం వివరంగా లేఖలు రాసింది. ఆ వివరాలపై ఏపీలో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బనకచర్లకు అనుమతులు ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడం గమనార్హం.
Banakacharla | ఏపీకి కేంద్రం భారీ షాక్.. బనకచర్లకు అనుమతి ఇవ్వలేమని వెల్లడి
