Hyderabad Metro| విధాత, హైదరాబాద్ : ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లుగా మెట్రో యాజమాన్యం వెల్లడించింది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి.
ఇటీవల కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చార్జీల విషయంలో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మెట్రో యాజమాన్య సంస్థ ఎల్ ఆండ్ టీ దిగివచ్చింది. పెంచిన చార్జీలలో 10 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.