Site icon vidhaatha

Nallacheruvu Revival : హైడ్రా సక్సెస్ స్టోరీలో నిన్న బతుకమ్మ కుంట..నేడు నల్లచెరువు!

hydra-success-story-nallacheruvu-restoration-hyderabad

Nallacheruvu Revival | విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా చోరవతో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఆక్రమ నిర్మాణాలతో..నిర్మాణ వ్యర్థాలు..చెత్త..పిచ్చిమెుక్కలతో ఆనవాళ్లు కోల్పోతూ..మురికి గుంటలుగా మారిన చెరువులను హైడ్రా ఒక్కొక్కటిగా పునరుద్దరిస్తున్న తీరుతో నగరంలోని చెరువులు, కుంటలు జలకళతో కొత్త హంగులతో సింగారించుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు బతుకమ్మ కుంటకు పూర్వవైభవం తెచ్చి నగర జనం జేజేలు అందుకున్న హైడ్రా..తాజాగా కూకట్‌పల్లిలోని నల్ల చెరువు పునరుద్దరణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసి పూర్వవైభవాన్ని కల్పించింది. హైడ్రా చొరవతో క‌బ్జాల చెర నుంచి బ‌య‌ట‌ప‌డింది. మురుగును వ‌దిలించుకుంది. పేరుకుపోయిన చెత్త‌ను తొల‌గించుకుంది.కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే నల్లచెరువు చెరువు రూపురేఖ‌లు మారిపోయాయి. నేడు స‌రికొత్త జ‌లాశ‌యంగా మారింది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు నిండుకుండ‌లా క‌నిపిస్తోంది

ఆక్రమణలతో 17 ఎకరాలకు కుంచించుకుపోయిన 27 ఎకరాల చెరువును తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్దరించింది. అన్ని ఆక్రమణలను తొలగించిన తర్వాత దాని పూర్తి ఫుల్ ట్యాంక్ లెవల్ వరకు పునరుద్ధరణ చేయడంతో చుట్టు జనావాసాల మధ్య జలసిరి సోయగంతో నల్లచెరువు సుందర జలాశయంగా కనువిందు చేస్తుంది. పునరుద్దరించబడిన నల్లచెరువు తాజా ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కొత్తరూపు దాల్చిన నల్ల చెరువును చూసి అక్క‌డ నివాసం ఉన్న వాళ్లే అచ్చెర‌ువొందుతున్నారు. ప్రస్తుతం నల్లచెరువు బోటు షికారుకు కూడా వేదికైంది.

నల్లచెరువు సుందరీకరణతో అనేక ప్రయోజనాలు : హైడ్రా కమిషనర్ రంగానాథ్

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ నల్లచెరువు పునురుద్దరణపై స్పందిస్తూ న‌ల్ల చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌తో కుంచించుకుపోయి 16 ఎక‌రాలలో మురికి గుంటగా మారిందని.. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌మాచారంతో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిని హైడ్రా చేప‌ట్టిందన్నారు. చెరువులోకి జ‌రిగి ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించిందని… చెరువులో పోసిన నిర్మాణ వ్య‌ర్థాల‌తో పాటు ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక‌ను పూర్తిగా తొల‌గించ‌డ‌మే కాకుండా.. 4 మీట‌ర్ల లోతు మ‌ట్టిని కూడా తొల‌గించిందని తెలిపారు. 4 నెల‌ల్లో 28 ఎక‌రాల మేర చెరువు త‌యార‌య్యింద‌ని మురుగు నీరు క‌ల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామన్నారు. వరద నీటి రాకపోకలకు అవుట్ లెట్లు, ఇన్ లెట్లు నిర్మించామన్నారు. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించామని..చెరువు పునరుద్దరణతో భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీట‌రున్న‌ర పాత్ వే అందుబాటులోకి వ‌చ్చిందన్నారు. దాదాపు 600ల మంది వ‌ర‌కూ వ‌చ్చి వాకింగ్ చేస్తున్నారు. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఆరోగ్య ప‌రంగా మంచి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నాం. చిన్నపాటి వేడుక‌ల‌కు కూడా ఇక్క‌డ క‌మ్యూనిటీ హాళ్లు ఏర్పాటుచేస్తున్నాం. మ‌ల్టీ ప‌ర్ప‌స్‌గా దీనిని త‌యారు చేస్తున్నామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. మొద‌టి విడ‌త‌గా చేప‌ట్టిన ఆరు చెరువుల్లో అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట.. కూక‌ట్ ప‌ల్లి న‌ల్ల‌చెరువు దాదాపు సిద్ధ‌మవ్వ‌గా.. మ‌రి కొన్ని రోజుల్లో మిగ‌తా 4 చెరువులు (బ‌మృక్ను ద్దౌలా చెరువు, ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువు, త‌మ్మిడికుంట‌, సున్నం చెరువు) కూడా సిద్ధ‌మౌతాయి. త‌ర్వాత మ‌రో 13 చెరువుల అభివృద్ధిని చేప‌డ‌తామని తెలిపారు.

Exit mobile version