కాకి లెక్కలంటే తెలియదు..జగన్ లెక్కలంటే తెలుస్తుందేమో?

• ప్రభుత్వ తీరుకు నిరసనగా మాక్ అసెంబ్లీని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ• స్పీకర్ స్థానంలో కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సభను ప్రారంభించారు.• కోవిడ్ మృతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.• గద్దె రామ్మోహన్ రావు - కరోనా మొదటి వేవ్ నుంచి అనేక రాష్ట్రాలు పాఠాలు నేర్చుకొని ముందుగానే మేల్కొని కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కుంటే జగన్ రెడ్డి మాత్రం ఆ దిశగా పయనించకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఇంత విపత్తు సంభవించి ఉండేది […]

  • Publish Date - May 20, 2021 / 11:25 AM IST

• ప్రభుత్వ తీరుకు నిరసనగా మాక్ అసెంబ్లీని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ
• స్పీకర్ స్థానంలో కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సభను ప్రారంభించారు.
• కోవిడ్ మృతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
• గద్దె రామ్మోహన్ రావు – కరోనా మొదటి వేవ్ నుంచి అనేక రాష్ట్రాలు పాఠాలు నేర్చుకొని ముందుగానే మేల్కొని కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కుంటే జగన్ రెడ్డి మాత్రం ఆ దిశగా పయనించకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఇంత విపత్తు సంభవించి ఉండేది కాదేమో? రాబోయే కాలంలో కాకి లెక్కలంటే తెలియదు జగన్ లెక్కలంటే తెలుస్తుందేమో? రుయా ఆసుపత్రిలో ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనం. ఇంత క్షిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో దీర్ఘకాలిక క్వారంటైన్ లోనే ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినందుకు ప్రజలను కష్టాల్లో గాలికి వదిలేశారు.

• బుద్దా నాగజగదీశ్వరావు, ఎమ్మెల్సీ -కరోనాతో సహజీవనం చెయ్యాలని జగన్ రెడ్డి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం చేతగానితనంలో ఆక్సిజన్ అందగా బెడ్లు దొరకక చనిపోతున్నారు. ప్రతి జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలి. వ్యాక్సిన్ పంపిణీలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.40 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు. రూ.3000 కోట్లు రంగులకు వెచ్చించిన ప్రభుత్వం ప్రజల ప్రాణాల కోసం రూ. 1600 కోట్లు కట్టలేకపోయారు. మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ధప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి. చనిపోయిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు లాంటి పెద్దల సలహాలు తీసుకొని ఉంటే ఇంత విపత్తు జరిగి ఉండేది కాదు.
• కరోనా బారిన పడి చనిపోయి 9,600 మంది కుటుంబాలకు మాక్ అసెంబ్లీ సభ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
• కరోనాతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతికి సానుభూతిని తెలియజేసిన మాక్ అసెంబ్లీ.
• కరోనాపై చర్చకు డిమాండ్ చేసిన టీడీపీ సభ్యులు
• అచ్చెన్నాయుడు : ప్రతి ఒక్కరు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని కుటుంబాలు బిక్కు బిక్కుమంటున్న బ్రతుకుతున్నాయి. ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.
• పయ్యావుల కేశవ్ : కరోనా విషయంలో ప్రపంచం పాఠాలు నేర్చుకునే పరిస్థితుల్లో ఉంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనుభవం లేని ప్రభుత్వం. తమిళనాడు, కేరళలో ప్రతిపక్షాలను కలుపుకొని ప్రభుత్వాలు ముందుకు వెళ్లాయి.
• కరోనా పై చర్చకు అనుమతించిన స్పీకర్.