Site icon vidhaatha

Digital Platforms: OTT సిరీస్‌ల హింసాత్మక కంటెంట్ పిల్లలపై చూపే ప్రభావాలు

impact-of-ott-on-children

డిజిటల్ మీడియా విస్తరణతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి ప్లాట్ ఫారమ్స్ లో లభ్యమయ్యే సిరీస్‌లలో హింసాత్మక దృశ్యాలు, అతిగా డ్రమటైజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, నేరప్రవర్తనల గ్లామరైజేషన్ ఎక్కువ.  ఈ కంటెంట్ పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుందని అనేక పరిశోధనలు, అధ్యయనాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.

హెచ్ఐవీ కన్నా ప్రమాదం…

టీవీలో ప్రోగ్రామ్స్, సినిమాలు, వెబ్ సిరీస్, వీడియోగేమ్స్ వంటి వాటి ద్వారా హింసాత్మక కంటెంట్ కి ఎక్స్ పోజ్ అయిన పిల్లల్లో దురుసైన ఆలోచనలు, అగ్రెసివ్ నేచర్ పెరుగుతాయని, ప్రవర్తనా లోపాలు ఏర్పడుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెబుతోంది. వీరి నివేదిక ప్రకారం రోజుకు రెండు గంటల పాటు హింసాత్మక వీడియోలు చూసే పిల్లల్లో అగ్రెసివ్ ప్రవర్తన 2.4 రెట్లు ఎక్కువగా ఉంటుంది.  ఇది హెచ్ ఐవీ అంతటి ప్రమాదకరమైన జబ్బని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ హెచ్చరిస్తోంది. పెద్ద ఎత్తున హింసకు సంబంధించిన వీడియోలు చూసిన పిల్లలు నిజానికీ, అవాస్తవానికీ మధ్య తేడాను గుర్తించలేరు. దీనివల్ల ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కోల్పోతారు. అదే హింస తమకు జరిగితే ఎలా ఉంటుందన్న సెన్సిటివ్ నెస్ కూడా లేకుండా పోతుంది. రెండవ తరగతి నుంచి రోజుకి ఒకటిన్నర నుంచి 1.8 గంట వరకు హింసాత్మక వీడియోలను చూసే పిల్లలు 12 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా అటెన్షన్ డెఫిసిట్, అకాడమిక్ డిస్ ఎంగేజ్ మెంట్, సోషల్ విత్ డ్రావల్, ఎమోషనల్ డిస్ట్రెస్, ఆత్మన్యూనత పెరుగుతాయి.

మెదడులో ఏం జరుగుతుంది?

హింసాత్మక వీడియోలు చూసేటప్పుడు మెదడుకు ఫంక్షనల్ ఎంఆర్ఐ చేసినప్పుడు ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. హింసాత్మక సన్నివేశాలు చూస్తున్నప్పుడు పిల్లల మెదడులో ఉండే అమిగ్డలా భాగం అత్యంత చురుగ్గా మారుతుంది. (భయం, డిప్రెషన్ లాంటి ఎమోషన్స్ ని ఈ భాగం నియంత్రిస్తుంది). అదే సమయంలో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఈ భాగం ఇంపల్సివ్ స్వభావాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా తార్కికమైన నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఇలాంటి మార్పులు ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ని పెంచి విచక్షణ మరిచేలా చేస్తాయని చెబుతున్నారు న్యూరోసైంటిస్టులు.

మానసిక ప్రభావాలు

దీర్ఘకాలిక ప్రభావాలు

పరిష్కారం ఏంటి?

 

Exit mobile version