Site icon vidhaatha

జనగామ జిల్లాలో.. ఏసీబీకీ చిక్కిన ఆర్ఐ

విధాత వరంగల్ ప్రతినిధి: జనగామ జిల్లాలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా ఆర్ ఐ వినయ్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా బాధితులు సోమవారం రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ ఐని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా చిల్పూర్ మండల కేంద్రంలో ఏసీబీ దాడులు జరగడంతో తీవ్ర చర్చగా మారింది.

Exit mobile version