విధాత : సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలు శనివారం జూబ్లీహిల్స్ పెద్ధమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు.
ఐపీఎల్ 2025 టోర్నిలో భాగంగా ఆదివారం కొల్ కతా నైట్ రైడర్స్ తో ఎస్ ఆర్ హెచ్ ఉప్పల్ వేదిక గా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ ఆర్ హెచ్ టీమ్ ఇప్పటికే ఉప్పల్ స్టేడియంకు చేరుకుంది. ఇప్పటికే ఈ ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ టీమ్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో తొలి మ్యాచ్ మినహా వరుసగా మూడు మ్యా చ్ లు ఓడి టోర్నిలో ముందుకెళ్లడంతో సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కోంటుంది.
సన్ రైజర్స్ ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు మండి పడుతున్నారు. అంచనాలకు భిన్నంగా సన్ రైజర్స్ వరుస ఓటముల పాలవ్వడాన్ని ఆ జట్టు యాజమాన్యం జీర్ణించుకోలేకపోతుంది.
ఈ పరిస్థితుల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు పెద్ధమ్మ తల్లిని దర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది. కనీసం పెద్ధమ్మ తల్లి కరుణతోనైనా ఇక మీదట జరిగే మ్యాచ్ లలో సన్ రైజర్స్ ఆటగాళ్లు రాణించి వరుస విజయాలతో దూసుకపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.