Site icon vidhaatha

Jaiyetri Makana | అమ్మో.. జైత్రీ! అది నువ్వేనా.. నీలో ఈ కోణం కూడా ఉందా!

Jaiyetri Makana |

విధాత: జైత్రీ.. ఈ పేరు తెలియని యూ ట్యూబ్‌ వీక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతి త‌క్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తెలుగు అమ్మాయి. అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటూ.. రోజువారీగా మన ఇండ్లలో జరిగే విష‌యాల‌ను నేటి తరానికి నచ్చేలా ఆస‌క్తిగా మ‌ల‌చడంలో దిట్ట. అందుకే ఆమె వైరల్లీ ఓరిజినల్స్‌లో వచ్చే ఈ అమ్మడు వీడియోలు స‌ర్రున దూసుకుపోతుంటాయి.

క‌రోనా స‌మ‌యంలో యూ ట్యూబ్ వీడియోల‌తో మంచి పేరు సంపాదించిన జైత్రీ అడపాదడపా సినిమాల్లోనూ అవకాశాలు పొందుతూ ఉంది. తుపాకుల గూడెం సినిమాలో హీరోయిన్‌గాను నటించింది. యూ ట్యూబ్‌లో గ‌ర్ల్ నెక్ట్స్ డోర్ అన్న రీతిలో వీడియోలు చేసిన ఈ అమ్మడులో మరో కోణం కూడా ఉంది.

అయితే సమయం దొరికినప్పుడల్లా వీదేశీ టూర్లు చేస్తూ స్విమ్మింగ్‌ పూల్స్‌, బీచ్‌లలో ఎంజాయ్‌ చేస్తూ తన డ్రెస్సింగ్‌తో హట్‌నెస్‌ పెంచుతూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పొగొడుతున్నది. యూ ట్యూబ్‌ వీడియోలలో చాలా ప‌ద్ధ‌తిగా దుస్తులు వేసుకునే జైత్రీ.. ప‌ర్యాట‌క ప్రాంతాల్లో మాత్రం అన‌సూయ‌, త‌మ‌న్నాల‌ను మించి స్టైల్ మెయింటెన్ చేస్తుంది.

ఈ వీడియోలు, ఫొటోలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మేం చూసేది అసలు జైత్రీనేనా, ఇలాంటి డ్రెస్సులు కూడా వేస్తుందా అనుకుంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి మరి.