Site icon vidhaatha

Army: భారత ఆర్మీలో చేరండి.. నోటిఫికేషన్ జారీ!

విధాత: భరతమాత సేవలో.. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే వారికి భారత ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం పలికింది. దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

18ఏళ్ల నుంచి 42ఏళ్లలోపు వారికి ప్రాదేశిక ఆర్మీలో చేరేందుకు అవకాశం కల్పించింది. విద్యార్హత డిగ్రీ గా పేర్కొంంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యతనివ్వనున్నట్లుగా తెలిపింది. అభ్యర్థులు మెడికల్ గా.. ఫిజికల్ గా ఫీట్ గా ఉండాలని తెలిపింది. మే 12 నుంచి జూన్ 10 వరకు అప్లికేషన్లు చేసుకోవాలని.. జూన్ 20న ఆన్ లైన్ పరీక్ష ఉంటుందని పేర్కొంది.

Exit mobile version