Site icon vidhaatha

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ముందు సుదీర్ఘ విచారణ

విధాత‌: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ముందు సుదీర్ఘ విచారణ జ‌రిగింది. ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా అనే అంశంపై వాదనలు జ‌రిగాయి. కోర్టు ఉల్లంఘనలపై ఎన్జీటీ గల అధికారాలపై ముగిసిన ఏపీ వాదనలు,ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా అని ఏపీ వాదనలు .ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది వెంకటరమణి ఇప్పటివరకు చేసినవి డీపీఆర్, ఇతర పనుల కోసమేనని ఇప్పటివరకు చేసిన పనులు పూడ్చమంటారా అని ఏపీ ప్రభుత్వం అడిగింది.

ప్రజోపయోగ పనులను న్యాయస్థానం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ట్రైబ్యునల్ ను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ఫొటోలు ఇచ్చింది,తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం.ఏపీ లేవనెత్తిన అంశాలపై ఈ నెల 21న వాదనలు వినిపించనున్న పిటిషనర్ వాదనలు వినిపించనున్న గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదులు.

Exit mobile version