Site icon vidhaatha

Vijayasanthi: మన రాములమ్మనే! జీన్స్ ప్యాంట్.. షర్ట్‌లో ఆశ్చర్యపరిచిన విజ‌య‌శాంతి

విధాత: రాములమ్మగా పిలుచుకునే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చాల ఏళ్ల తర్వాతా తన అభిమానులకు కర్తవ్యం సినిమా రోజులను గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉంటునే తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీలో నటించారు. సోమవారం జరిగిన ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో విజయశాంతి జీన్స్ ప్యాంట్ .. షర్ట్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. విజయశాంతి తనలోని ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని చాటారు.

టీజర్ రిలీజ్ సందర్భంగా తన మాటల్లోనూ ఆమె అదే జోష్ తో మాట్లాడారు. సరిలేరు నీకెవరు సినిమా తరువాత అందరు నన్ను ఒక యాక్షన్ సినిమా చేయమన్నారని.. ఈ సినిమాతో నా ఫాన్స్ కు ఫుల్ మీల్స్ దొరుకుతుందన్నారు. ఈ వయసులో ఫైట్ సీన్స్ చేస్తారా అన్న మూవీ టీమ్ కంగారు మధ్య సెట్ లోకి అడుగుపెట్టి తన యంగ్ ఏజ్ లో మాదిరిగానే సింగిల్ షాట్ ఫైట్ సీన్ ను పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నానన్నారు. అప్పుడు ఎప్పుడు విజయశాంతినే… అదే పౌరుషం, అదే రోషం..ఏం తగ్గెదే లే అంటూ ఎంత ఏజ్ అయినా ఇదే ఎనర్జిటిక్ గా ఉంటానంటూ అభిమానులను ఉత్సాహాపరిచారు. తాను ఇప్పటికి ఇంత ఎనర్జిటిక్ గా ఉండటానికి తన తల్లిదండ్రుల పెంపకం కారణమని, అందరూ తమ తల్లిదండ్రులను గైరవించాలని చేసే పనిని కమిటిమెంట్, డెడికెషన్ తో పూర్తి చేయాలని సూచించారు.

”అర్జున్ సన్నాఫ్ వైజయంతి స్టోరీ స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ – కొడుకు బాండింగ్ కథ అని.. వారి మధ్య యుద్ధం ఎలా ఉంటుందనేదానిపై మూవీ సాగుతుందన్నారు. ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ చేశానన్నారు. ప్రదీప్ చిలుకూరి డెబ్యూ డైరెక్టర్ గా అనిపించలేదని..కథ పూర్తి చేయడానికి ఒక ఏడాది టైం పట్టిందన్నారు. కళ్యాణ్ రామ్ నిజంగా రాముడు లాంటి మంచి బాలుడని, వర్క్ చేసేప్పుడు నేను ఇబ్బంది పడకూడదని ప్రతీ నిమిషం జాగ్రత్త తీసుకుంటూ, ఎంతో ఆప్యాయత చూపించడంపై నేనే షాక్ అయ్యానన్నారు. సినిమా షూటింగ్ అయిపోవడంతో కళ్యాణ్ రామ్ ను చాలా మిస్ అవుతున్నానన్నారు. అప్పుడప్పుడు గెట్ టూ గెదర్ పెట్టుకుని కలవాలన్నారు.

కళ్యాణ్ రామ్ డైరెక్టర్లను భలే వెతికిపట్టుకొస్తాడని.. సినిమా మీద అతనికి చాలా ప్యాషన్ ఉందని.. ఎన్టీఆర్ మనవళ్లు అంటే మాములుగా ఉంటుందా అని విజయశాంతి చెప్పుకొచ్చారు. రామారావు నేర్పించిన డెడికేషన్, సిన్సియారిటీ, క్రమశిక్షణ అదని.. ఈ జెనరేషన్ లో ఇలా ఉండటం నాకే షాక్ అనిపించిందని..అతను ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటూ మంచి మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నానన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ విజయశాంతితో తనకు చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉందని.. ‘సూర్య ఐపీఎస్‌’ షూట్‌కు వెళ్తే తనని సొంత బిడ్డలా చూసుకుందని..ఆమెను నేను అమ్మ అనే పిలుస్తానని కళ్యాణ్ రామ్ చెప్పారు. సినిమా హిట్ కోసం అమ్మ తిరుమలకు మొక్కారని..మొక్కు పూర్తయ్యాక చేపల పులుసు కూర అమ్మకు పెడుతానన్నారు. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రూపొందిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించగా.. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version