Site icon vidhaatha

NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, అరిజోనా యూనివర్సిటీ భారీ ఒప్పందం..

NSE:

ముంబయి: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పూర్తి ఆధీనంలో ఉన్న NSE అకాడమీ లిమిటెడ్ (NAL), అరిజోనా స్టేట్ యూనివర్శిటీ (ASU)లోని థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో జట్టు కట్టింది. సాంకేతికత, ఆర్థిక రంగం, వ్యాపార విద్యపై దృష్టి సారించే సంయుక్త సర్టిఫికేట్ కార్యక్రమాలను అందించడానికి ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిపుణులు, సీనియర్ నాయకులను విస్తృత నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ భాగస్వామ్యం ద్వారా NSE అకాడమీ, థండర్‌బర్డ్ కలిసి స్థానిక శిక్షణ నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయి పరిశోధన ఆధారిత పాఠ్యాంశాలు కలిగి ఉంటాయి. AI, ఫైనాన్స్, ఎజైల్ నాయకత్వం, డిజిటల్ ఫైనాన్స్, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ఆధారపడిన బూట్‌క్యాంప్ శైలి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కేంద్రీకృతమైన విస్తృత కార్యక్రమాలను ఈ సహకారం తోడ్పడనుంది.

కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా స్థిరమైన వ్యాపార పద్ధతులకు మార్గం సుగమం చేయాలని, తదుపరి తరం నాయకులను సిద్ధం చేయాలని ఇది ఉద్దేశించింది. థండర్‌బర్డ్ ప్రధాన కేంద్రంలో పరిశ్రమ సంబంధిత అనుభవాలు, లీనమయ్యే అధ్యయన అవకాశాలు పాల్గొనేవారికి లభిస్తాయి. దీని ద్వారా సాంకేతికత, నాయకత్వంపై సమగ్ర అవగాహనతో పాటు కీలక పరిశ్రమల్లో వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా థండర్‌బర్డ్ డైరెక్టర్ జనరల్, డీన్ చార్లా గ్రిఫ్ఫీ-బ్రౌన్ మాట్లాడుతూ.. “NSE అకాడమీతో ఈ భాగస్వామ్యం ప్రపంచ నాయకులకు అత్యుత్తమ విద్యను అందించాలనే మా లక్ష్యంలో కీలక దశ. అంతర్జాతీయ వాణిజ్యంలో మూడు సంవత్సరాలుగా అగ్రస్థానంలో ఉన్న థండర్‌బర్డ్, ఈ సహకారం ద్వారా ఉన్నత ఆలోచనా నైపుణ్యాన్ని వ్యాపార రంగానికి అందిస్తోంది.

NSE అకాడమీతో కలిసి అత్యాధునిక కార్యక్రమాలను రూపొందించడంతో పాటు భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ ఆవిష్కరణలు, స్థిరమైన వ్యాపారం, ఆర్థిక వృద్ధిని నడిపించే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దుతున్నాం” అని తెలిపారు. NSE అకాడమీ లిమిటెడ్ CEO అభిలాష్ మిశ్రా మాట్లాడుతూ.. “ప్రపంచ వ్యాపార విద్యలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన థండర్‌బర్డ్ స్కూల్‌తో సహకరించడం ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా డైనమిక్ గ్లోబల్ ఎకానమీలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, నిపుణులకు అందించే కొత్త అధ్యయనాన్నిప్రారంభించాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

Exit mobile version