Site icon vidhaatha

Nawabpet Reservoir : నవాబు పేట రిజర్వాయ్ నుంచి నీటీ విడుదల చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు

Nawabpet Reservoir

విధాత : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపూర్ మండలం నవాబుపేట గ్రామంలోని దేవాదుల ప్రాజెక్టు నవాబుపేట రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి నీటిని విడుదల చేశారు. భువనగిరి ఎంపీ చాడ కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గుండాలలో నేను సమావేశం నిర్వహించినప్పుడు ప్రజలు నవాబుపేట నుండి నీరు రావాలని కోరారని గుర్తు చేశారు. గుండాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, శ్రీహరిని కలసి సమస్యను పరిష్కరించమని కోరటంతో సానుకూలంగా స్పందించి నేడు నీటిని విడుదల చేసుకోవటం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కార దిశగా ప్రజాపాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.

Exit mobile version