Site icon vidhaatha

Mastan Sai: లావ‌ణ్య కేసులో కొత్త మ‌లుపు! బాంబ్ పేల్చిన మస్తాన్ సాయి.. ఆ వీడియోలు ఎవ‌రివంటే?

విధాత‌: ఆరు నెల‌ల క్రితం రాజ్ త‌రుణ్‌ (Raj Tharun), లావ‌ణ్య‌ (Lavnya) ల‌కు సంబంధించిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఊపేసిన సంగ‌తి అంద‌రికీ విధిత‌మే. ఆ త‌ర్వాత రాజ్ త‌రుణ్‌ సినిమాల విడుద‌ల స‌మ‌యంలో త‌రుచూ ఈ ఇష్యూ తెర‌పైకి వ‌చ్చి ఆపై క‌నుమ‌రుగ‌వవుతూ వ‌చ్చింది. ఇదిలాఉండ‌గా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో బాగా వినిపించిన మ‌స్తాన్ సాయి (Mastan Sai) ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌కు రావ‌డంతో క‌థ అనేక మ‌లుపులు తిరిగింది. అంతేగాక లావ‌ణ్య‌ మ‌స్తాన్ సాయిల అడియో కాల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ కూడా చేశాయి. తిరిగి మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత ఈ వివాదం మ‌రోసారి లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. గ‌తంలోనే ఓ కేసులో అరెస్ట్ అయిన మ‌స్తాన్ సాయి తాజాగా ప్రైవేట్ వీడియోల‌తో బెదిరిస్తున్నాడంటూ లావ‌ణ్య ప‌లుమార్లు నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో చేసిన ఫిర్యాదుల‌ నేప‌థ్యంలో సోమవారం ఆరెస్ట్ అయ్యాడు.దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ కేసు విష‌యంలో లావ‌ణ్య (Lavnya) .. మ‌స్తాన్ సాయి (Mastan Sai) ఇంటికి వెళ్లి మ‌రీ ఓ హార్డ్ డిస్క్‌ను తీసుకు వ‌చ్చి పోలీసుల‌కు అంద‌జేసింది. ఇందులో అమ్మాయిలకు సంబంధించి 200వ‌ర‌కు పర్స‌న‌ల్ వీడియోలు ఉన్నాయ‌ని వాటితో అందులో ఉన్న వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. అందులో నేను బాధితురాలినేన‌ని న‌న్ఉ బ‌లాత్కారం చేసిన వీడియో కూడా ఉంద‌ని పేర్కొంది. కాగా ఆ వీడియోల్లో ఉన్నది ఎవరు? ఎలా రికార్డ్ చేశారని పలు ప్రశ్నలు చాలానే ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు.. తెలుగు చిత్ర‌సీమ‌కు స‌బంధించి ప్రముఖ తారల వీడియోలు కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం జ‌రుగుతోంది.

ఈ స‌మ‌యంలోనే తాజాగా మస్తాన్ సాయి స్పందించి త‌న వాద‌న‌ వినిపించాడు. ఆ వీడియోల్లో ఉన్న‌ది బ‌య‌టి వాళ్లు కాద‌ని కొన్ని వీడియోల్లో నా భార్య, మ‌రికొన్ని వీడియోల్లో గ‌ర్ల్‌ ఫ్రెండ్ మాత్ర‌మే ఉన్నార‌ని, అవి కూడా వారిద్దరి ఇష్టంతోనే చిత్రీకరించిన‌ట్లు తెలిపాడు. నా వీడియోలను అడ్డం పెట్టుకుని లావ‌ణ్య (Lavnya) తనపై తప్పుడు ప్రచారం చేస్తోంద‌ని, ఇంకా ఆ హార్డ్ డిస్క్‌లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి.. వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తోంద‌ని ఆరోపించాడు. ఇదిలాఉండ‌గా గ‌తంలో మ‌స్తాన్ సాయి (Mastan Sai) ఓ సారి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైల‌ర్ అవుతోంది.

Exit mobile version