Robinhood Trailer: నితిన్‌, శ్రీలీల రాబిన్‌హుడ్ ట్రైల‌ర్ రిలీజ్‌. అప్పుడే హిట్ టాక్‌

Robinhood Trailer | Nithiin | Sreeleela | David Warner నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ విడుద‌ల చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌గా జీవీ ప్ర‌కాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందించాడు. ఛ‌లో, భీష్మ చిత్రాల త‌ర్వాత […]

Robinhood Trailer | Nithiin | Sreeleela | David Warner

నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ విడుద‌ల చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించ‌గా జీవీ ప్ర‌కాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందించాడు. ఛ‌లో, భీష్మ చిత్రాల త‌ర్వాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

శ్రీలీల (Sreeleela) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా కేతిక శ‌ర్మ ఓ ప్ర‌త్యేక గీతంలో న‌టిస్తోంది. న‌ట కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్‌తో పాటు అస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే క‌డుపుబ్బా న‌వ్వించడం గ్యారంటీ అనేలా ఉండ‌డంతో పాటు గైలాగ్స్‌, యాక్ష‌న్ సీన్స్ ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేలా ఉంది.