- భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం
- అత్యాధునిక పద్ధతులను వాడుకొని భూ సర్వే
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Bhu Bharathi | తెలంగాణ రాష్ట్రంలో నిజాంనవాబుల కాలం నాటి నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చేయని లేదా రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఈ సమస్యకు పరిష్కారం చూపలేదని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నదని తెలిపారు. ఇందులో భాగంగా 413 గ్రామాల్లోని ఐదు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, వచ్చే వారం నుంచి సర్వే చేస్తున్నామని చెప్పారు.
పైలట్ మండలాలు ఇవే..
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రామం, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ , ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామన్నారు. ఏరియల్/ డ్రోన్ సర్వే రెండు పద్ధతుల్లో సర్వే నిర్వహిస్తామన్నారు. ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతుల్లో సర్వే చేసి జియో రిఫరెన్డ్స్, క్యాడస్ట్రల్ మ్యాపులు, హక్కుల నమోదు పత్రాలను తయారుచేస్తారని తెలిపారు.
పాదర్శకత, వివాద పరిష్కారం
నూతన విధానాల వల్ల భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందన్నారు, ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రీ సర్వే కోసం అనుభవంగల ఆర్వీ అసోసియేట్స్, మార్వెల్ జియో స్పేషియల్, ఐఐసి టెక్నాలజీస్, నియో జియో, డ్రోగో డ్రోన్ సంస్థలను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. ఆధునిక యంత్రాలు, టెక్నాలజీని వాడుకుని శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
BJP Mind Game | కాంగ్రెస్‌కు బీజేపీ షాక్ వెనుక! దౌత్య బృందం సారథ్యం థరూర్‌కు
King Cobra | ఈ పామును చూస్తే.. మీకు రాత్రి నిద్ర కూడా పట్టదు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. తక్కువ ధరకే సిమెంట్, స్టీల్