ప్రతి కుటుంబానికి సొంతిల్లు ప్రభుత్వ సంక‌ల్పం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల‌ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్లుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణా రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు.

హైద‌రాబాద్, విధాత: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల‌ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్లుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణా రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు.

పెరుగుతున్న పట్టణీకరణతో పాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన, పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన, సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు.రాష్ట్రం లో ఇప్పటివరకు అమలైన గృహ కార్యక్రమాల ద్వారా సాధించిన పురోగతిని వివరిస్తూ గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా సుమారు 42 లక్షల ఇండ్లను నిర్మించగా, ఇప్పడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని మంత్రి గారు తెలిపారు. అంతే కాకుండా మధ్య తరగతి కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా సుమారు ఒక లక్ష ఇళ్లు నిర్మించినట్లు వివరించారు.

అయినా కూడా రాష్ట్రంలో గృహాల డిమాండ్ , సరఫరా మధ్య భారీ అంతరం ఉందని, ఈ అంతరాన్ని పూడ్చడానికి, వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, ప్రభుత్వ లక్ష్యానికి మూలస్తంభం లాంటి తెలంగాణ- 2047ను ఆదాయంతో సంబంధం లేకుండా ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్నిరూపొందిస్తున్నామని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన “గృహ నిర్మాణ తెలంగాణ నమూనా 2047” వైపు చారిత్రక అడుగు వేస్తున్నాం. ఈ నమూనా తప్పనిసరిగా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా సమ్మిళితంగా, పర్యావరణపరంగా బాధ్యతాయుతంగా, సాంకేతికత ఆధారితంగా ఉండాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

Latest News