ముంబై:దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఒకటైన HDFC మ్యూచువల్ ఫండ్ (HDFC MF) తన పెట్టుబడి నిర్వాహక సంస్థ HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కో. లిమిటెడ్ ద్వారా WhatsApp ఆధారిత “Tap2Invest” సేవను ప్రారంభించింది. ఈ పరిశ్రమలో తొలిసారి చేపట్టిన ఈ చొరవ, KYC ధృవీకరణ పూర్తి చేసిన పెట్టుబడిదారులకు WhatsAppలో సులభమైన, ట్యాప్ ఆధారిత అనుభవంతో మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తుంది.
సంప్రదాయ WhatsApp సేవల్లా టెక్స్ట్ ఇన్‌పుట్‌లపై ఆధారపడకుండా, ఈ సౌలభ్యం WhatsAppలోనే పెట్టుబడి యాప్‌లా స్పష్టమైన క్లిక్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. పెట్టుబడిదారులు (+91-82706 82706) నంబర్ ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ప్రారంభించడం లేదా ఏకమొత్తం పెట్టుబడి చేయడం సాధ్యమవుతుంది. UPI ఆటోపే, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ చెల్లింపు ఎంపికలకు ఈ ప్లాట్‌ఫామ్ మద్దతు ఇస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రతను నిర్ధారిస్తూ, పెట్టుబడుల నిర్వహణకు సురక్షితమైన మార్గాన్ని అందజేస్తుంది.
ప్రారంభ సందర్భంగా HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ MD & CEO నవనీత్ మునోత్ మాట్లాడుతూ.. “HDFC AMCలో పెట్టుబడిదారుల ప్రయాణాన్ని సరళీకరించడానికి సాంకేతికతను వినియోగిస్తున్నాం. డిజిటల్ సొల్యూషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి భారతీయుడికి సంపద సృష్టికర్తగా నిలవాలనే మా లక్ష్యాన్ని సాధిస్తాం. భద్రత కల్పించే ప్లాట్‌ఫామ్‌ల అవసరాన్ని గుర్తించాం. ఈ Tap2Invest సేవ.. సులభమైన ట్యాప్ ఆధారిత అనుభవాన్ని అందిస్తుంది. WhatsAppలాంటి సుపరిచిత వేదికను వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్‌ఫేస్‌తో అనుసంధానం చేసి, యాక్సెసిబిలిటీని పెంచడం, పెట్టుబడిని ఇబ్బంది లేని ప్రక్రియగా మార్చడం మా ఉద్దేశం” అని తెలిపారు. KYC ధృవీకరణ పూర్తి చేసిన HDFC మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు మరిన్ని వివరాల కోసం +91-82706 82706 నంబర్‌లో WhatsApp ద్వారా సంప్రదించవచ్చు.